శ్రీవారి ఆన్లైన్ టికెట్లు ప్రారంభించిన టీటీడీ ఈవో | TTD released online ticket for srivari darshanam in Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆన్లైన్ టికెట్లు ప్రారంభించిన టీటీడీ ఈవో

Published Wed, Aug 20 2014 10:58 AM | Last Updated on Sat, Aug 25 2018 7:22 PM

TTD released online ticket for srivari darshanam in Tirumala

తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం ఇంటర్నెట్, ఈ దర్శన్ కౌంటర్లకు రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ బుధవారం తిరుమలలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రోజుకు 5 వేల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ రోజు టికెట్ తీసుకున్నవారికి 7వ రోజు దర్శనం లభిస్తుందని తెలిపారు. అలాగే ఈ నెల 31వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ టికెట్లు విడుదల చేసిన కొన్ని నిముషాల వ్యవధిలోనే భక్తులు 300 టికెట్లు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement