
పెరటాసి మాసం కారణంగా రద్దీ కొనసాగగా.. నేడు మాత్రం భక్తుల రద్దీ కాస్త
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ పరిస్థితికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉంటే.. నిన్న శ్రీవారిని 80,551 మంది దర్శించుకున్నారు. పెరటాసి మాసం కారణంగా రద్దీ కొనసాగగా.. సర్వదర్శనానికి ఏకంగా 35 గంటల సమయం పట్టింది. మరోవైపు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లుగా లెక్క తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,028 మంది.