sarva darshan
-
23 నుంచి శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు ఇవ్వనున్న టీటీడీ
-
తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,158 మంది స్వామివారిని దర్శించుకోగా 24,938 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు , దర్శనానికి 5 గంటల సమయం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న(ఆదివారం) స్వామివారిని 84,797 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 29,497 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 64,467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
తిరుమల: సర్వదర్శనానికి 15 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ పరిస్థితికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ్రీవారిని 80,551 మంది దర్శించుకున్నారు. పెరటాసి మాసం కారణంగా రద్దీ కొనసాగగా.. సర్వదర్శనానికి ఏకంగా 35 గంటల సమయం పట్టింది. మరోవైపు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లుగా లెక్క తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,028 మంది. -
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
సాక్షి, తిరుమల: దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని ఈ నెల 12 నుంచి నిలిపివేస్తున్నట్లు టీటీడీ బుధవారం తెలిపింది. ఆదివారం (11–04–2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం విదితమే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూల్లో వేచి ఉంటున్నారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. -
సర్వదర్శనం ఇక సులభతరం
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శనివారం తిరుమల పోటెత్తింది. భక్తులతో 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అలాగే కాలినడకన వచ్చిన భక్తులతో 13 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దాంతో తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 7 గంటలు, రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. -
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 5 నుంచి సర్వదర్శనం
* ఆన్లైన్లో 10 వేల టికెట్ల కేటాయింపు: టీటీడీ ఈవో తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శ నం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. జనవరి 1న వచ్చిన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఈవో వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1న వేకువజామున 1.45 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. నేరుగా వచ్చిన వీఐపీతో పాటు మరో ముగ్గురికే దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖ లకు దర్శనాలు ఉండవన్నారు. అనుకున్నదాని కంటే ముందే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 10 వేల మంది భక్తులకు ద్వాదశి రోజున దర్శనం ఉంటుందన్నారు. ఈ టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్లో కేటాయిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున 9 గంటలకు బంగారు రథం ఊరేగింపు, ద్వాదశి రోజున ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. రెండు పర్వదినాల సం దర్భంగా నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.