
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శనివారం తిరుమల పోటెత్తింది. భక్తులతో 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అలాగే కాలినడకన వచ్చిన భక్తులతో 13 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దాంతో తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 7 గంటలు, రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.