MG Gopal
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు తేవాల్సిందే!
► అధికారుల కమిటీతో రెవెన్యూ, గ్రూప్-1, గెజిటెడ్ సంఘాలు ► విధివిధానాల్లోనే మార్పులు అవసరమని వెల్లడి సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును (టీఏఎస్) అమల్లోకి తేవాల్సిందేనని వివిధ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అయితే విధి విధానాల రూపకల్పనలో మాత్రం అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టీఏఎస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం సచివాలయంలో గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో సమావేశమైంది. ఆయా సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చేసిన అధ్యయన నివేదికలను అందజేసి.. వాటిలోని అంశాలపై చర్చించాయి. సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, కన్వీనర్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘాలు టీఏఎస్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనగా, రెవెన్యూ అధికారుల సంఘం మాత్రం టీఏఎస్ అక్కర్లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే రెవెన్యూ అధికారులతోనే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రస్తుత రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి: రెవెన్యూ జేఏసీ చిన్న జిల్లాల నేపథ్యంలో టీఏఎస్ అవసరం లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఆందోళనలో ఉన్నారు. పని లేక, అవకాశాలు లేక చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ చేస్తే రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి. దీనిపై అవసరమైతే మేం మరిన్ని రాష్ట్రాల్లో మరోసారి అధ్యయనం చేస్తాం. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పరిపాలన సర్వీసుల్లో 50 శాతం డెరైక్టు నియామకాల విధానం ఉంది. అందరికి అవకాశం వచ్చేలా టీఏఎస్: గెజిటెడ్ అధికారుల సంఘం అందరికి అవకాశాలు వచ్చేలా టీఏఎస్ ఉండాలి. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. గ్రూప్-1 సర్వీసెస్ స్థానంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేయాలి. గ్రూప్-1 సర్వీసులోని ఉద్యోగులను టీఏఎస్‌లో జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరీలుగా విభజించాలి. ఈ కేటగిరీల కిందే ఉద్యోగాలను భర్తీ చేయాలి. టీఏఎస్‌లో వారి కామన్ సీనియారిటీని కొనసాగించాలి. ఒక్క శాఖకే పరిమితం చేయకుండా టీఏఎస్ పరిధిలోనే బదిలీలు ఉండాలి. ఒక్క సబ్జెక్టుతో వచ్చిన వారైన ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వారిని వెనక్కి పంపించాలి. డిపార్ట్మెంట్లలోని సీనియర్లనే విభాగాధిపతులుగా నియమించాలి. అందరిని ఒప్పించి చేయాలి. మేం అధ్యయనం చేస్తాం. అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకోవాలి. టీఏఎస్ తప్పనిసరి: గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్రంలో టీఏఎస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. ప్రస్తుతమున్న గ్రూప్1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. టీఏఎస్‌లో 3 గ్రేడ్లుండాలి. 8 ఏళ్ల గ్రూప్-1 సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్‌గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్, 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్‌గా పరిగణించాలి. వివిధ విభాగాధిపతులు (హెచ్‌వోడీ), ఎండీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతోపాటు నాన్ రెవిన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి. -
సోమేశ్‌కుమార్‌కు పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్‌గా సోమేశ్‌కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆర్నెల్లపాటు పొడిగించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసిపోవడంతో గత డిసెంబర్ 4 నుంచి ప్రభుత్వం ఆయనను స్పెషలాఫీసర్‌గా నియమించింది. కొత్త పాలకమండలి అధికారంలోకి వచ్చేంత వరకు లేదా ఆర్నెల్లపాటు ఆయనను స్పెషలాఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం అప్పట్లో జీవో జారీ చేసింది. ఆ గడువు బుధవారంతో ముగిసిపోవడంతో తిరిగి 4వతేదీ (గురువారం) ఉదయం నుంచి గవర్నర్ ఆయననే స్పెషలాఫీసర్‌గా కొనసాగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. స్పెషలాఫీసర్ హోదాలో కార్పొరేషన్, స్టాండింగ్ కమిటీల విధుల్ని ఆయనే నిర్వహిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గెజిట్లోనూ ప్రకటిస్తారు. -
20 మంది ఐఏఎస్‌లు డౌటే!
తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో పలువురు కేంద్ర సర్వీసుల్లో.. మరికొందరు రిటైర్ అయినవారు.. కాబోయేవారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్‌ను నియమించే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఐఏఎస్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తయినా వారిలో ఏకంగా 20 మంది అధికారులు ఇప్పటికిప్పుడు సేవలందించే అవకాశం లేదు. వీరిలో చాలామంది కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. మరికొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరికొందరు త్వరలో రిటైర్ కావాల్సిన వారున్నారు. తెలంగాణకు కేటాయించిన 128 మంది ఐఏఎస్ అధికారుల్లో మొదటి యాభై పేర్లలోనే దాదాపు పది మంది సీనియర్ అధికారులు రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. విచిత్రంగా 2005లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రపంచ బ్యాంకులో పనిచేయడానికి వెళ్లిన రణదీప్ సుడాన్ (1983 బ్యాచ్) అనే సీనియర్ అధికారిని తెలంగాణకు కేటాయించారు. ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేయడానికి వెళ్లిన గడువు ముగిసిపోయి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. సెలవులను కూడా పొడిగించుకోలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వలేదు. తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ అధికారి విషయాన్ని సీఎస్ రాజీవ్‌శర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. కేంద్రానికి నివేదించాలని సూచించినట్లు సమాచారం. సోమవారం ఢిల్లీ వెళ్లిన రాజీవ్ శర్మ అక్కడ సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారని తెలిసింది. కాగా, సీనియర్ అధికారుల్లో ఒకరైన ఎంజీ గోపాల్‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే అధికారుల జాబితాను పరిశీలించిన సీఎం.. వారి పోస్టింగ్‌లపై ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అధికారులను నేడోరేపో రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను రిలీవ్ చేయగానే వారు ఇక్కడ చేరాల్సి ఉంటుంది. వీరిలో వచ్చేవారెవరో?: తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లలో ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారిలో బినయ్‌కుమార్, సీబీ వెంకటరమణ, ఆర్.భట్టాచార్య, చిత్రా రామచంద్రన్, పుష్పా సుబ్రమణ్యం, వసుంధరా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, సుతీర్థ భట్టాచార్య, రజత్ భార్గవ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, రాణి కుముదిని, అరవిందకుమార్, ఏకే సింఘాల్ ఉన్నారు. పదవీ విరమణ చేసిన వారిలో చందనాఖన్, అరవింద్‌రెడ్డి ఉన్నారు. ఈనెల 31న ఆర్.భట్టాచార్య పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం. కాగా ఎంసీఆర్ హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న లక్ష్మీపార్థసారథి ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. సస్పెండ్ అయిన వై.శ్రీలక్ష్మిని కూడా తెలంగాణకే కేటాయించారు. నలుగురికి పదోన్నతులు: 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్, ఎంజీ గోపాల్, వినోద్ కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్ ఆచార్యలకు ఒకట్రెండు నెలల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీటీఆర్ఐ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ఏకే ఫరీదా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కేటాయింపులపై గెజిట్ నోటిఫికేషన్ అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఇటీవల జారీ చేసిన గెజిట్ ఉత్తర్వులను టీ సర్కార్ రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లో మార్పులు కోరే అధికారులు తమ దరఖాస్తులను సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల ద్వారా పంపించాలని డీవోపీటీ స్పష్టంచేసింది. పరస్పర మార్పిడి, భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే అధికారులు.. కావాల్సిన పోస్టింగ్ కోసం నేరుగా డీవోపీటికి దరఖాస్తులను పంపాలని పేర్కొంది. మరోవైపు ఒకే బ్యాచ్ లేదా పేగ్రేడ్లో ఉన్న తమ సహచరుల కోసం అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాలనే అధికారులు ఈ మేర ప్రయత్నాలు చేస్తున్నారు. -
తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
టీటీడీ ఈవోకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక పరమైన భావనలు, కార్యక్రమాలు మాత్రమే ఉండాలని, అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు స్పష్టంచేశారు. తిరుమలలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు వార్తలు రావడంతో చంద్రబాబు ఈవోతో ఫోన్లో మాట్లాడారు. నిందితుల వివరాలు తెలుసుకున్నారు. ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి
తిరుపతి : ఇంటర్నెట్, ఈ-దర్శనం కౌంటర్ల కోసం మూడు వందల రూపాయల టికెట్లను టీటీడీ ఈవో గోపాల్ బుధవారం విడుదల చేశారు. ఐదు వేల టికెట్లు విడుదల కాగా.. క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి. మరోవైపు విజయవాడలో ఈ టికెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇచ్చారు. అందులో 2500 టికెట్లను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయించారు. మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయింపు జరిగింది. టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్లో 75 కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల సమయం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు. -
శ్రీవారి ఆన్లైన్ టికెట్లు ప్రారంభించిన టీటీడీ ఈవో
తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం ఇంటర్నెట్, ఈ దర్శన్ కౌంటర్లకు రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ బుధవారం తిరుమలలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రోజుకు 5 వేల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ రోజు టికెట్ తీసుకున్నవారికి 7వ రోజు దర్శనం లభిస్తుందని తెలిపారు. అలాగే ఈ నెల 31వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ టికెట్లు విడుదల చేసిన కొన్ని నిముషాల వ్యవధిలోనే భక్తులు 300 టికెట్లు కొనుగోలు చేశారు. -
శ్రీవారి బంగారం బ్యాంకుల్లో భద్రం
ఎస్బీఐలో 1,800 కిలోలు డిపాజిట్ చేసిన టీటీడీ ఏడాదికి 12 కిలోల బంగారం వడ్డీగా చెల్లించనున్న బ్యాంకు టీటీడీ మొత్తం బంగారం డిపాజిట్లు 4,335 కిలోలు తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారాన్ని బ్యాంకుల్లో నిక్షిప్తం చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తెలిపారు. ఈ డిపాజిట్లపై ఒక శాతం వడ్డీని బంగారం రూపంలో చెల్లించేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు వివరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో 1,800 కిలోల బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తూ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఈవో గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ... ఎస్బీఐలో గోల్డ్ డిపాజిట్ స్కీం కింద ఐదేళ్ల కాలపరిమితికి 1,800 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఏడాదికి ఒక శాతం వడ్డీని బంగారు రూపంలో ఇచ్చేందుకు బ్యాంక్ అంగీకరించిందన్నారు. టీటీడీ డిపాజిట్ చేసిన స్వర్ణాభరణాలను ఎస్బీఐ ముంబైలోని మింట్‌కు తరలించి కరిగించి 0.9995 స్వచ్ఛత గల బంగారాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుందని చెప్పారు. ఇందుకయ్యే రవాణా, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, కరిగించి శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చులను వారే(ఎస్బీఐ) భరిస్తారన్నారు. ఈ డిపాజిట్లపై సంవత్సరానికి 12 కిలోల బంగారాన్ని వడ్డీ కింద బ్యాంక్ చెల్లిస్తుందని, ఆ బంగారాన్ని తిరిగి అదే బ్యాంక్‌లో డిపాజిట్ చే స్తామని చెప్పారు. టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో 4,335 కిలోల బంగారు డిపాజిట్లు కలిగి ఉందని తెలిపారు. వీటిపై సంవత్సరానికి 70 కిలోల బంగారం వడ్డీ రూపంలో అందుతున్నట్లు చెప్పారు. ఆ మేరకు 2010 నుంచి చేసిన డిపాజిట్లపై ఇప్పటివరకు 85 కిలోల వడ్డీ బంగారం అందినట్లు వివరించారు. -
28 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : ఈవో
సాక్షి, తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ వెల్లడించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో హైకోర్టు న్యాయమూర్తి భట్ తిరుమల : హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులు, జిల్లా జడ్జిలు స్వాగతం పలికారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకోనున్నారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ కూడా గురువారం మధ్యాహ్నం తిరుమలకు రానున్నారు. సాయంత్రం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు. జనవరి 1 దర్శనానికి నేడు సుదర్శన టికెట్ల విక్రయం నూతన ఆంగ్ల సంవత్సరాది 2014, జనవరి ఒకటో తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు గురువారం టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు టీటీడీ పీఆర్వో రవి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 సుదర్శన టికెట్లను దేశవ్యాప్తంగా ఉన్న ఈ-దర్శన్ కౌంటర్లలో విక్రయిస్తారని పేర్కొన్నారు. మొత్తం 2,500 టికెట్లను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. అక్టోబర్ 5 నుంచి 13 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 3 కోట్లతో ఆలయ పురవీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మించారు. ఆలయ గోపురాలకు రంగులు, విద్యుద్దీపాల అలంకరణలు, నాలుగు మాడ వీధుల్లో రంగవల్లులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేశారు. గురువారం నుంచి 16వ తేదీ వరకు వికలాంగులు, వృద్ధుల మహా ద్వార ప్రవేశం రద్దు చేశారు. కల్యాణవేదిక వద్ద పుష్ప, ఫొటో ప్రదర్శన శాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఏర్పాట్లపై వారు బుధవారం విస్తృతంగా ఇతర అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భద్రతలో భాగంగా మొత్తం 460 సీసీ కెమెరాలు పనిచేయనున్నారుు. ఆక్టోపస్ కమాండోలు, ఏఆర్ కమాండోలు, ఎస్పీఎఫ్ సిబ్బం ది, 3వేల మంది పోలీసులు, 156 మంది బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ సురేష్ భగవత్, ఇతర అధికారులు రెండు రోజులుగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమలలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 13 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న కాలిబాట భక్తులకు 5 గంటలుగా దర్శన సమయం నిర్ణయించారు. భక్తుల రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం సాయంత్రం వరకు అనుమతించి తరువాత నిలిపివేశారు. గదులకు డిమాండ్ పెరిగింది. 5న తిరుమలకు సీఎం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ నెల 5న తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.