సోమేశ్‌కుమార్‌కు పదవీ కాలం పొడిగింపు | Somesh kumar term extension | Sakshi
Sakshi News home page

సోమేశ్‌కుమార్‌కు పదవీ కాలం పొడిగింపు

Published Thu, Jun 4 2015 2:04 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Somesh kumar term extension

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్‌గా సోమేశ్‌కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆర్నెల్లపాటు పొడిగించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసిపోవడంతో గత డిసెంబర్ 4 నుంచి ప్రభుత్వం ఆయనను స్పెషలాఫీసర్‌గా నియమించింది.
 
 కొత్త పాలకమండలి అధికారంలోకి వచ్చేంత వరకు లేదా ఆర్నెల్లపాటు ఆయనను స్పెషలాఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం అప్పట్లో జీవో జారీ చేసింది. ఆ గడువు బుధవారంతో ముగిసిపోవడంతో తిరిగి 4వతేదీ (గురువారం) ఉదయం నుంచి గవర్నర్ ఆయననే స్పెషలాఫీసర్‌గా కొనసాగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. స్పెషలాఫీసర్ హోదాలో కార్పొరేషన్,  స్టాండింగ్ కమిటీల విధుల్ని ఆయనే నిర్వహిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గెజిట్‌లోనూ ప్రకటిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement