సాక్షి, తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ వెల్లడించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తిరుమలలో హైకోర్టు న్యాయమూర్తి భట్
తిరుమల : హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులు, జిల్లా జడ్జిలు స్వాగతం పలికారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకోనున్నారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ కూడా గురువారం మధ్యాహ్నం తిరుమలకు రానున్నారు. సాయంత్రం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.
జనవరి 1 దర్శనానికి నేడు సుదర్శన టికెట్ల విక్రయం
నూతన ఆంగ్ల సంవత్సరాది 2014, జనవరి ఒకటో తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు గురువారం టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు టీటీడీ పీఆర్‌వో రవి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 సుదర్శన టికెట్లను దేశవ్యాప్తంగా ఉన్న ఈ-దర్శన్ కౌంటర్లలో విక్రయిస్తారని పేర్కొన్నారు. మొత్తం 2,500 టికెట్లను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
28 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : ఈవో
Published Thu, Nov 7 2013 2:38 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement
Advertisement