ఆధార్‌తోపాటు ప్రభుత్వ కార్డులకూ టికెట్ల జారీ | Tickets issued by government Card | Sakshi
Sakshi News home page

ఆధార్‌తోపాటు ప్రభుత్వ కార్డులకూ టికెట్ల జారీ

Published Fri, Dec 23 2016 3:23 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ఆధార్‌తోపాటు ప్రభుత్వ కార్డులకూ టికెట్ల జారీ - Sakshi

ఆధార్‌తోపాటు ప్రభుత్వ కార్డులకూ టికెట్ల జారీ

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు ఆధార్‌తోపాటు పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లెసెన్స్, ఓటర్, రేషన్‌ కార్డుల్లో ఏదో ఒకటి స్వీకరించి టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు చెప్పారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టికెట్లకు కేవలం ఆధార్‌ మాత్రమే స్వీకరిస్తామన్న నిర్ణయంపై ఈవో స్పష్టత ఇచ్చారు. కాలిబాటల్లో వచ్చే భక్తులకు ఫొటోమెట్రిక్‌ పద్దతిలోనే టికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి కొందరు తిరుమలకు వస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement