ఏడంతస్థుల భవనం పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హబ్సిగూడలో వెలుగుచూసింది.
హైదరాబాద్: ఏడంతస్థుల భవనం పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబ్సిగూడ కాకతీయనగర్‌లో శనివారం వెలుగుచూసింది.
కాలనీలోని సూర్యాస్పేన్డెర్ టవర్‌లో నివాసముంటున్న సాంబశివరావు(65) అనే వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.