నల్లగొండ టుటౌన్ : బీసీల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం రుణాలు అందించకపోవడం అన్యాయమన్నారు. బీసీల స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేసి, భూమిలేనిపేద బీసీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కాసోజు విశ్వనాథం, వైద్యం వెంకటేశ్వర్లు, మైనం నారాయణ, సిరిప్రోలు వెంకటపతి, ఇంద్రయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, దుడుకు లక్ష్మీనారాయణ, గండిచెరువు వెంకన్నగౌడ్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
Published Wed, Oct 22 2014 3:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement