
మా చావుకొచ్చింది...
ఆత్మహత్యాయత్నం నేరం కాదన్న కేంద్ర నిర్ణయం నగర పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కొందరు ఆత్మహత్యాయత్నాలంటూ హల్‌చల్ చేస్తుంటారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో వారిపై కేసులు పెట్టేవారు. జైలు శిక్ష భయంతో చాలామంది వెనక్కి తగ్గేవాళ్లు. దాంతోపాటు మంటల్ని ఆర్పే యంత్రాలు, అగ్నిమాపక శకటాలు, వలలు, నిచ్చెనలతో అప్రమత్తంగా ఉండేవారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్లకు అడ్డుకట్ట కష్టమన్నది పోలీసుల భావన.
ముఖ్యమైన ప్రాంతాలు, ప్రముఖుల పర్యటనలకు మాత్రమే పోలీసు బందోబస్తు, పహారా, నిఘా ఉండేది. ఇప్పుడు ఎత్తై ప్రాంతాలు, భవనాలు, హోర్డింగ్స్, కిరోసిన్, పెట్రోల్ విక్రయించే ప్రాంతాలను నిఘా పరిధిలో చేర్చాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద పోలీసు సిబ్బంది పహారా ఉండనున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో