సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీటుగా బరిలోకి దిగడంతో టీడీపీ దిగాలు పడుతోంది. ఫ్యాన్ స్పీడ్ పెరగ్గా తమ సైకిల్ గాలి తగ్గుతోందని తెలుగుదేశం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు హ్యాట్రిక్ ఖాయం అంటూ తొలుత ప్రచారం చేసుకున్న నేతలు ఇప్పుడు జన స్పందన చూసి అయోమయంలో పడ్డారు. చాపకింద నీరులా అంతర్గత విభేదాలు ప్రచారంపై ప్రభావం చూపుతుండడంతో తెలుగుదేశం నేతలు సతమతమవుతున్నారు.
సీనియర్లకు కాదని...
టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్లకు కాదని తనకు అనుకూలంగా వ్యవహరించే కొత్త వారికి సీట్లు ఇవ్వడంతో పలు డివిజన్లలో అసంతృప్తి వర్గం చాపకింద నీరులా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. దాంతో తమ ఓట్లు చీలిపోతాయేమోననే ఆందోళన ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రచారం గడువు ముగిసే సమయం ముంచుకొస్తున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఈ గుబులు ఎక్కువ అవుతోంది.
ప్రచారం జోరు పెంచిన వైఎస్సార్ సీపీ
మేయర్ అభ్యర్థి ఎంపికతో యువతకు పెద్ద పీట వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చాటి చెప్పారు. అర్హులైన కార్యకర్తలను కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎంపిక చేయడంతో పార్టీ పరిస్థితి పటిష్టంగా మారింది.
నగరాధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ సారథ్యంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మేడపాటి షర్మిలా రెడ్డి తన మూడో డివిజన్‌తో పాటు ఇతర డివిజన్లలో కూడా ప్రచారం సాగిస్తున్నారు.
సైకిల్‌కు తగ్గుతున్న గాలి
Published Mon, Mar 24 2014 1:58 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement
Advertisement