
విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడిన వివాదం దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడలోని కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఏర్పడింది. 34వ డివిజన్ టికెట్ ఇచ్చే వరకు కదలమని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్!
Comments
Please login to add a commentAdd a comment