:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్నా జీవీఎంసీలో మాత్రం ఆ జాడ లేదు. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, పది గ్రా మ పంచాయతీల విలీనంతో వా ర్డుల పునర్విభజన జరగలేదు. పైగా ఇందులో ఐదు పంచాయతీ ల విలీనాన్ని రద్దు చేస్తూ తక్షణమే ఎన్నికలు నిర్వర్తించాల్సిందిగా
హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీన ప్రక్రియకూడా ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లేవని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
వేరుపడనున్న భీమిలి?
భీమిలి, జీవీఎంసీకి మధ్య అనుసంధానంగా ఉన్న కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాల విలీన ప్రక్రియను రద్దు చేసి ఈ ఐదు పంచాయతీలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పీళ్లుకు వెళ్తుందనుకున్న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) కూడా వీటిని జీవీఎంసీ నుంచి విముక్తి కలిగి స్తూ ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు తెలిసిం ది.
భీమిలి విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు మళ్లీ మొదటికొచ్చాయి. గతం లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆయన అనుంగు అనుచరుడైన స్థానిక నేత అడ్డగోలుతనం వల్లే భీమిలి విలీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, స్థానికులెవరికీ భీమిలి విలీనం ఇష్టం లేదంటూ స్థానికలు ఆందోళనకు దిగుతున్నారు. దక్షిణ భారతదేశంలో తొలి పురపాలక సంఘంగా భీమిలికున్న చారిత్రక ప్రాశస్త్యానికి భంగం కలిగించొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఏయూడీ కూడా భీమిలిని మున్సిపాలిటీగానే ఉంచేం దుకు నిర్ణయానికొచ్చినట్టు జీవీఎంసీలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
వార్డుల పునర్విభజనకు కనీసం ఆరు నెలలు! : భీమిలి, ఐదు పంచాయతీల్ని మినహాయించి అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల మేరకు వార్డుల పునర్విభజన చేపట్టాల్సి ఉంది.
యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ ప్రారంభించినా.. కనీసం ఆరు
నెలలు పడుతుందని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. భీమిలి విలీనంపై సందిగ్ధత తొలగేందుకు ఎంత సమయం
పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నెలాఖరులోగా తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. వీటి అనంతరం కోర్టు కేసులున్న
మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జీవీఎంసీలో ఉన్నట్టుగా విచిత్ర పరిస్థితి మరే కేసులోనూ లేదు. దీంతో జీవీఎంసీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆధారపడి ఉందని అధికారులు చెప్తున్నారు.