local election
-
Sri Lanka: పాపం శ్రీలంక.. నిధులు లేక ఎన్నికలు వాయిదా..!
కొలంబో: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ కావడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది. ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఆ దేశ విదేశీ మారకపు నిల్వలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మూడు వారాల దిగుమతికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
సీఎం రాజేకు షాక్
⇒ ముఖ్యమంత్రికి పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పాగా ⇒ రాజస్తాన్ స్థానిక ఎన్నికల్లో పుంజుకున్న హస్తం ⇒ ఈ ఎన్నికలు బీజేపీ సర్కారుపై అవిశ్వాసం లాంటివి: పైలట్ జైపూర్: రాజస్తాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి వసుంధరారాజేకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈనెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 129 మున్సిపాలిటీల్లో బీజేపీ 66 చోట్ల మెజారిటీ సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. ఆ పార్టీ సుమారు 35 మున్సిపాలిటీల్లో దాదాపు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 17 చోట్ల బీజేపీతో నువ్వానేనా.. అన్నట్టుగా పోటీనిచ్చింది. ఏడు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. మొత్తం 3,351 వార్డులకుగాను బీజేపీ 1,443 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 1,164 వార్డులను కైవసం చేసుకుంది. సీఎం వసుంధరా రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న జలావర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు మున్సిపాలిటీల్లో మెజారిటీ సాధించింది. ఈ జిల్లాలో బీజేపీ మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక ధోల్పూర్ జిల్లాలో ఉన్న మూడూ మున్సిపాలిటీలు బడీ, ధోల్పూర్, రాజఖేరాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. వసుంధర ధోల్పూర్ రాజ కుటుంబీకురాలు కావడం గమనార్హం. ఇక దుశ్యంత్‌సింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బరన్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మెజారిటీ కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు: పైలట్ ఈ ఫలితాలు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసం లాంటివని కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అభివర్ణించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లతేడా 26 శాతం ఉండగా, ఈ ఎన్నికల్లో అది ఒక శాతానికి తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని, ఇప్పుడు వారు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని పైలట్ మీడియాతో అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. పార్టీలు గెలుచుకున్న వార్డుల వివరాలు బీజేపీ - 1,443 కాంగ్రెస్ - 1,164 ఎన్సీపీ - 19 బీఎస్పీ - 16 సీపీఐ - 5 సీపీఎం - 1 ఇండిపెండెంట్లు - 703. -
పరిశీలకులను నియమించిన వైఎస్సార్ సీపీ
-
‘స్థానిక’ ఎన్నికల వైఎస్సార్సీపీ పరిశీలకులు వీరే!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులను నియమించింది. ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎం.ప్రసాదరాజు (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్, సుజయ్ కృష్ణ రంగారావు, కోలగట్ల వీర భద్రస్వామి, బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్నాథ్, బొడ్డేటి ప్రసాద్ (విశాఖపట్టణం), జి.ఎస్.రావు, జ్యోతుల నెహ్రూ, ఐ.రామకృష్ణంరాజు(తూ.గోదావరి), ధర్మాన ప్రసాదరావు, ఆదిరెడ్డి అప్పారావు, ఆళ్ల నాని(ప.గోదావరి), కె.పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభాను (కృష్ణా), కొడాలి నాని (విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్), మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణారావు, వి.బాలశౌరి, భూమన కరుణాకర్‌రెడ్డి(గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎల్.అప్పిరెడ్డి (ప్రకాశం), వి.ప్రభాకర్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి (నెల్లూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్నాథ్రెడ్డి (చిత్తూరు), వైఎస్ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు (వైఎస్సార్ కడప), అనంత వెంకట్రామిరెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, శంకరనారాయణ(అనంతపురం), భూమా నాగిరెడ్డి (కర్నూలు) పరిశీలకులుగా నియమితులయ్యారు. వీరు కాక ఆయా జిల్లాల్లోని ఎంపీలు కూడా స్థానిక ఎన్నికల పరిశీలకులుగా ఉంటారు. కేంద్ర కార్యాలయంలో ఎంవీ మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షక విభాగం సభ్యులుగా వ్యవహరిస్తారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవూకాంత్రెడ్డి స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ర్ట ఎన్నికల సంఘం వుంగళవారం జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించింది. వుున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్‌మిట్టల్‌లు పోలీసు డెరైక్టర్ జనరల్ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) వీఎస్కే కౌముది, అదనపు డీజీ ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అనురాధ తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయుతీ ఎన్నికల సవుయుంలో గుర్తించిన సవుస్యాత్మక, సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలతో పాటు, ఎన్నికల సవుయుంలో హింసాత్మక సంఘటనలు జరిగిన కేంద్రాలను కూడా ఈ జాబితాలో చేర్చాలని రమాకాంత్‌రెడ్డి సూచించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ఒకేసారి వస్తున్నందున శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అతిసున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. -
పొన్నాల, దామోదర, అరుణ అన్యాయం చేశారు: ఎమ్మెల్యే అబ్రహం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థుల బి.ఫారాలు తనకు ఇవ్వకుండా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య,తీవ్ర అన్యాయం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేకే న్యాయం చేయలేని కాంగ్రెస్... ప్రజలకు ఏం సామాజిక న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో చేరే అంశంపై కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తన హయాంలో జరిగిందని, నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వెంకట్రామిరెడ్డికి బి.ఫారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించార -
బంగారం.. బరిలో నిలువ్!
ఎన్నికలు మగాళ్లకు చిక్కులు తెచ్చిపెట్టాయి. యాభై శాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని పురుష పుంగవులకు పోటీ చేసే చాన్స్ తగ్గిపోవడంతో తమ భార్యలను పోటీలో ఉంచేందుకు నానా తంటాలు పడుతున్నారు. పోటీకి వారు ఆసక్తి చూపకపోతుండడంతో బతిమాలి మరీ ఒప్పిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రజాప్రతినిధులుగా ఈ సారి మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. తామే బరిలో ఉండి రాజకీయం ఏలుదామని కలలుగన్న పలువురికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. దీంతో పోటీలో ఉండాలని తమ సతులను బతిమాలుడుతున్నారు. వారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించకున్నా.. పార్టీలో, వార్డులో పరువు కాపాడాలంటూ బుజ్జగిస్తున్నారు. ‘నువ్వు రాజకీయాల్లో తిరుగుడే దండగంటే... నీ వెంబడి నేను కూడా తిరగాలా? మాకే పదవీ అక్కర్లేదు’ అని ఖరాఖండిగా చెబుతు న్నా నయా నో... భయానో వారిని ఒప్పిస్తున్నారు. తమ మాట వినే పరిస్థితి లేనప్పుడు వారి పుట్టింటివారితోనూ చెప్పించి చూస్తున్నారు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు జగిత్యాల, సిరి సిల్ల, మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ నగర పంచాయతీల్లో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లలో నామినేషన్లకు గురువారంతో గడువు ముగియగా మున్సిపాలిటీ లు, నగరపంచాయతీలకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఈ ఎన్నికలతోనే అమలవుతున్నా యి. సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లి, వేములవాడ చైర్పర్సన్ పదవులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. డివి జన్లు, వార్డులోనూ 50 శాతం స్థానాలు మహిళలకే రిజర్వ్ చేశారు. దాదాపు అన్ని పార్టీలకు మహిళా అభ్యర్థుల ఎంపిక సవాల్‌గానే మారింది. వార్డుల్లో గెలిచే సత్తా ఉన్న వారిని వెదికి తమ ఆధిపత్యం తగ్గించుకునేకంటే తమ ఇంటివారినే గెలిపించుకుంటే వార్డుల్లో తమ ఆధిపత్యానికి ఎదురుండదనుకుని చాలా మంది నాయకులు తమ సతీమణులనే బరిలో ఉంచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కరీంనగరంలో చాలా మంది మాజీ కార్పొరేటర్లు రిజర్వేషన్ అనుకూలించక తమ సతీమణులతో నామినేషన్ వేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు... ఆసక్తితో మరికొందరు పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నామినేషన్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా వార్డుల ప్రజలే మహిళా అభ్యర్థులను తెరపైకి తీసుకొస్తున్నారు. చదువుకున్న వారు ఉంటే ఎక్కువ ప్రయోజనమని డిగ్రీ చదివిన మహిళలను పోటీలో ఉండాలని కోరుతున్నారు. గెలిపించుకునే బాధ్యత తమదేనని నామినేషన్ వేయాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల భార్యాభర్తలిద్దరూ తమకు రాజకీయాలు అవసరం లేదని చెబుతున్నా... ‘మీ భార్యను కౌన్సిలర్‌గా నిలబెడితే గెలిచే అవకాశం ఉందని పలువురు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన డబ్బులు తలా ఇంతా వేసుకుంటామని, పోటీకి వెనకకు రావద్దొంటూ కోరుతుండడంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. -
వైఎస్సార్సీపీ బోణీ కొట్టింది!
గూడూరు పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీ బోణీ కొట్టింది. ఎన్నికల నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. 33 వార్డుకు వైఎస్సార్సీపీ తరపున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆ పార్టీ బోణీ కొట్టినట్లుగా చెప్పవచ్చు. పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న 33వ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తాళ్ల సుబ్బమ్మ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు డమ్మీ అభ్యర్థిగా రామాబత్తిన వాసవి నామినేషన్ దాఖలు చేసింది. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం ఆ వార్డు నుంచి తాళ్ల సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించడం లాంఛనమే. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆ వార్డు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. -
బొత్సకు షాక్!
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోలుకోలేని షాక్ తగిలింది. పదేళ్ల ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది. ఆయన రాజకీయ కోట బీటలు వారింది. వైఎస్సార్ సీపీలోకి భారీగా నాయకులు చేరడంతో చీపురుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. రోజు వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు బొత్సకు చేయిచ్చారు. ఆయనతో రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. ఆయన ప్రధాన అనుయాయుడు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి గురువారం వైఎస్సార్ సీపీలో చేరగా, మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు రాం...రాం చెప్పి, విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఆయనతో పాటు బొత్స సన్నిహితులైన 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. వీరే కాదు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా లో అనేక మంది కాంగ్రెస్ నాయకులు బొత్సను వది లేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కబంధహస్తాల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయన బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడేది లేదంటూ నిష్ర్కమణకు సన్నద్ధమవుతున్నారు. షాడో నేత ఆగడాలు, సతాయింపు భరించాల్సిన రోజులు పోయాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయని నేతలు చెప్పుకొస్తున్నారు. ఫలించని బొత్స మంత్రాంగం కోల్పోతున్న పట్టును నిలబెట్టేందుకు బొత్స తీవ్ర ప్రయత్నాలే చేశారు. వదిలి వెళ్లిపోతున్న నాయకుల విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ పార్టీ మారిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. కనీసం మాట వినలేదు. ఇక కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పేశారు. పరోక్షంగా మీకో దండమని చెప్పేసి వచ్చేశారు. ఈ క్రమంలోనే చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో దాదాపు 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి, గురువారం రాత్రి రెండు బస్సులు, 20 కార్లలో బయలుదేరి వెళ్లి, విజయవాడలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మీసాల రమణ, కరిమజ్జి శ్రీనివాసరావు, కోరాడ రామారావు, గొర్లె రమణ, పిసిని శ్రీను, రెల్లి అప్పలనాయుడు, చింతాడ లక్ష్మణ, అధికార్ల శ్రీనుబాబు, బాణాన శ్రీనివాసరావు, చందక గురునాయుడు, పనస అప్పారావు, అంబల్ల రామకృష్ణ, రేవల్ల సత్తిబాబు, బూర్లె నరేష్, సరిది రమేష్, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తదితరులు ఉన్నారు. ఆందోళనలో బొత్స.. నాయకులు, కార్యకర్తలు చేజారడంతో బొత్స టెన్షన్‌కు లోనవుతున్నట్టు తెలిసింది. రాజకీయ అస్థిరతను కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కేడర్‌ను నిలబెట్టకపోతే పుట్టి మునిగిపోయే పరిస్థితి ఉందని భయపడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గతంలో కలిసి పనిచేసిన నాయకులందరికీ ఫోన్ చేసి రావాలని కబురు పెట్టారు. కానీ స్పందన రాలేదు. -
నాల్గోరోజు అదే జోరు
స్థానిక నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా వివిధ పార్టీల నుంచి 171 నామినేషన్లు సమర్పించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి 37, టీఆర్ఎస్ 39, టీడీపీ 15, బీజేపీ 19, బీఎస్పీ 3, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తోట రాజేంద్రప్రసాద్ 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. జమ్మికుంట : జమ్మికుంట నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు నాల్గో రోజు నామినేషన్ల జోరు కనిపించింది. వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడి మరీ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరకు 20 వార్డుల నుంచి 72 నామినేషన్లు దాఖలు కాగా కొత్తగా నామినేషన్ వేసిన వారిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. మిగతా 32 మంది మంగళ, బుధవారం వేసి మళ్లీ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. వార్డుల వారీగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే.. -
గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!
:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్నా జీవీఎంసీలో మాత్రం ఆ జాడ లేదు. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, పది గ్రా మ పంచాయతీల విలీనంతో వా ర్డుల పునర్విభజన జరగలేదు. పైగా ఇందులో ఐదు పంచాయతీ ల విలీనాన్ని రద్దు చేస్తూ తక్షణమే ఎన్నికలు నిర్వర్తించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీన ప్రక్రియకూడా ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లేవని ఉన్నతాధికారులు చెప్తున్నారు. వేరుపడనున్న భీమిలి? భీమిలి, జీవీఎంసీకి మధ్య అనుసంధానంగా ఉన్న కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాల విలీన ప్రక్రియను రద్దు చేసి ఈ ఐదు పంచాయతీలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పీళ్లుకు వెళ్తుందనుకున్న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) కూడా వీటిని జీవీఎంసీ నుంచి విముక్తి కలిగి స్తూ ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు తెలిసిం ది. భీమిలి విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు మళ్లీ మొదటికొచ్చాయి. గతం లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆయన అనుంగు అనుచరుడైన స్థానిక నేత అడ్డగోలుతనం వల్లే భీమిలి విలీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, స్థానికులెవరికీ భీమిలి విలీనం ఇష్టం లేదంటూ స్థానికలు ఆందోళనకు దిగుతున్నారు. దక్షిణ భారతదేశంలో తొలి పురపాలక సంఘంగా భీమిలికున్న చారిత్రక ప్రాశస్త్యానికి భంగం కలిగించొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఏయూడీ కూడా భీమిలిని మున్సిపాలిటీగానే ఉంచేం దుకు నిర్ణయానికొచ్చినట్టు జీవీఎంసీలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వార్డుల పునర్విభజనకు కనీసం ఆరు నెలలు! : భీమిలి, ఐదు పంచాయతీల్ని మినహాయించి అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల మేరకు వార్డుల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ ప్రారంభించినా.. కనీసం ఆరు నెలలు పడుతుందని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. భీమిలి విలీనంపై సందిగ్ధత తొలగేందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నెలాఖరులోగా తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. వీటి అనంతరం కోర్టు కేసులున్న మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జీవీఎంసీలో ఉన్నట్టుగా విచిత్ర పరిస్థితి మరే కేసులోనూ లేదు. దీంతో జీవీఎంసీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆధారపడి ఉందని అధికారులు చెప్తున్నారు.