ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి | In order to see the polls | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి

Published Wed, Mar 26 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి

 జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవూకాంత్‌రెడ్డి
 
 స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ర్ట ఎన్నికల సంఘం వుంగళవారం జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించింది. వుున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్‌మిట్టల్‌లు పోలీసు డెరైక్టర్ జనరల్ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) వీఎస్‌కే కౌముది, అదనపు డీజీ ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అనురాధ తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పంచాయుతీ ఎన్నికల సవుయుంలో గుర్తించిన సవుస్యాత్మక, సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలతో పాటు, ఎన్నికల సవుయుంలో హింసాత్మక సంఘటనలు జరిగిన కేంద్రాలను కూడా ఈ జాబితాలో చేర్చాలని రమాకాంత్‌రెడ్డి సూచించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ఒకేసారి వస్తున్నందున శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అతిసున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement