The State Election Commission
-
మండలి ఖాళీ స్థానాలపై వివాదం
ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని ఖాళీ స్థానాల అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మండలికి మధ్య వివాదంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చూపిన మేరకు 50 స్థానాలకు మించకుండా.. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీ స్థానాలను సర్దుబాటు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తుండగా శాసనమండలి మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఎన్నికల సంఘానికి శాసనమండలి ప్రత్యేక లేఖ పం పింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ మండలికి కేటాయించిన స్థానాలు 50. మండలి వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం 40 మం ది సభ్యులుండగా 13 ఖాళీ స్థానాలున్నాయి. ఈ రెండూ కలిపితే 53 అవుతాయి. చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా మూడు స్థానాలు అదనంగా ఉన్నట్టు అవుతోంది. స్థానాలను తగ్గించాలంటే వాటి పూర్తి పదవీకాలం ముగిశాకే సాధ్యమవుతుందని మండలి వర్గాలు వివరిస్తున్నాయి. శాసనమండలిలో ఖాళీగా ఉన్న 13 స్థానాల్లో 11 స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటా ఒకటి, మరొకటి గవర్నర్ నామినేటెడ్ కోటాగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల కోటా స్థానాల్లో తొమ్మిది స్థానాలు గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం అవ్వడం వల్ల భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. పోతుల రామారావు, తిప్పారెడ్డి, షేక్ హుస్సేన్‌లు మధ్యలో రాజీనామాలు చేసినందున, ఆ స్థానాల పదవీకాలం ఇంకా ఉన్నందున.. అప్పటివరకు అవి ఏపీ మండలి కోటాగానే ఉంటాయని, అందువల్ల వాటిని ఖాళీస్థానాలుగానే పరిగణిస్తాం తప్ప తగ్గినట్లుగా చూపలేమని మండలి వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 17 స్థానాలకుగాను విభజన చట్టంలో 16 పేర్లను ఇదివరకు సూచించారు. అందులో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఈనెల 24న ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మరో స్థానాన్ని అక్కడ భర్తీచేయాల్సి ఉంది. గవర్నర్ నామినేటెడ్ కోటాలోని షేక్ హుస్సేన్ రాజీనామా చేసినందున అది పూర్తిగా రద్దయినట్లుగా భావించి ఎమ్మెల్యే కోటాలో భర్తీచేయాల్సిన 17వ స్థానాన్ని నోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. -
ఎన్నాళ్లకో అధికారం..
ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో జాప్యం నెల దాటినా ఖరారు కాని ముహూర్తం ‘పీఠం’ ఆశావహులకు క్యాంపుల భారం జిల్లా పరిషత్ : అసలే ఆషాడం.. ఆపై అధిక మాసం అన్న చందంగా తయారైంది పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి. దేశ అత్యున్నత న్యాయ స్థానం జోక్యంతో ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. నెల రోజుల తర్వాత మే 13వ తేదీన ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి... విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిసి నెల గడిచింది. కానీ... గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కుదరడం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి... ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా... స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోగా... ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది. తమ సహచర ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల మద్దతును కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు. ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే ఎన్నికలు అనగానే... కొన్ని మండలాలకు చెందిన వారు క్యాంపులను విరమించుకున్నారు. వీరు మండలాలకు చేరుకోగానే వీరి ప్రత్యర్థులు గాలం వేయడం మొదలుపెట్టారు. దీంతో ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ ఆశావహులు మళ్లీ క్యాంపుల బాట పట్టారు. నెల రోజుల పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఏసీ రూముల్లో ఉంచుతూ... సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్షల్లో వ్యయమవుతుండడంతో లబోదిబోమంటున్నారు. మునిసిపాలిటీతో అడ్డంకి మొదలు.. ప్రాదేశిక ఎన్నికల కంటే ముందే మునిసిపాలిటీల ఎన్నికలు జరిగాయి. మునిసిపల్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించకుండా... ప్రాదేశిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మునిసిపాలిటిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక సంస్థల అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిద్దామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. కానీ... అంధ్రప్రదేశ్‌లో ఇంకా అసెంబ్లీ సమావేశాలు మొదలు కాలేదు. ఈనెల 19 వ తేదీ నుంచి నిర్వహిస్తామని ఏపీ నేతలు అంటున్నారు. శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణస్వీకారం చేశాక మూడు నాలుగు రోజుల గడువులోగా వారు ఏ స్థానిక సంస్థల్లో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికకు మరో పది, పదిహేను రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా... ఆంధ్రపదేశ్ రాష్ట్ర విభజన జరిగి.. నూతన రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పరిధి డోలాయమానంలో పడింది. దీనిపై కేంద్రం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఎన్నికల కమిషన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. అక్కడ జాప్యం జరుగుతుండడంతో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మునిసిపాలిటీ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమవుతోంది. -
రెండు దశల్లో ప్రాదేశిక ఎన్నికలు
ఒంగోలు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంగీకరించింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఎన్నికలను ఏప్రిల్ 6న ఒకేదశలో నిర్వహించి 8వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే పలు విభాగాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో రాష్ర్ట ఎన్నికల కమిషన్ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీంతో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం జిల్లాలో ఏప్రిల్ 6న 28 మండలాలకు, ఏప్రిల్ 11న 28 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగే మండలాలు: చీరాల, వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి, అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, సంతమాగులూరు, జే.పంగులూరు, యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, గిద్దలూరు, అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, కొమరోలు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగే మండలాలు: ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి, కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు, కనిగిరి, సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు, పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు.సార్వత్రిక ఎన్నికలపై స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతుందనే భావనతో తాత్కాలికంగా కౌంటింగ్ విషయాన్ని వాయిదా వేశారు. త్వరలోనే కౌంటింగ్ తేదీని ప్రకటిస్తామంటూ ఎస్ఈసీ ప్రకటించింది. -
‘పరిషత్తు’ ఎన్నికల వాయిదాపై మీ వైఖరేమిటి?
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని, దీని వల్ల ఓటర్లు నిష్పాక్షికంగా ఓటు వేయలేరని, ఈ దృష్ట్యా పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, లేదా కనీసం వాయిదా వేయాలని కోరుతూ వి.పవన్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి... దాదాపు 45 రోజుల పాటు బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించడం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాలను ప్రశ్నించారు. దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మున్సి‘పోల్స్’ ఫలితాలపై పిల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపేసేలా ఉత్వర్వులివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మునిసిపల్ ఎన్నికల ప్రభావం త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని, అందువల్ల మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాదులు రమేష్‌రెడ్డి, వి.రమణారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.శివారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవూకాంత్రెడ్డి స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ర్ట ఎన్నికల సంఘం వుంగళవారం జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించింది. వుున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్‌మిట్టల్‌లు పోలీసు డెరైక్టర్ జనరల్ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) వీఎస్కే కౌముది, అదనపు డీజీ ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అనురాధ తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయుతీ ఎన్నికల సవుయుంలో గుర్తించిన సవుస్యాత్మక, సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలతో పాటు, ఎన్నికల సవుయుంలో హింసాత్మక సంఘటనలు జరిగిన కేంద్రాలను కూడా ఈ జాబితాలో చేర్చాలని రమాకాంత్‌రెడ్డి సూచించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ఒకేసారి వస్తున్నందున శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అతిసున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.