ఒంగోలు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంగీకరించింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఎన్నికలను ఏప్రిల్ 6న ఒకేదశలో నిర్వహించి 8వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది.
అయితే పలు విభాగాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో రాష్ర్ట ఎన్నికల కమిషన్ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీంతో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం జిల్లాలో ఏప్రిల్ 6న 28 మండలాలకు, ఏప్రిల్ 11న 28 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగే మండలాలు:
చీరాల, వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి, అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, సంతమాగులూరు, జే.పంగులూరు, యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, గిద్దలూరు, అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, కొమరోలు.
ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగే మండలాలు:
ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి, కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు, కనిగిరి, సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు, పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు.సార్వత్రిక ఎన్నికలపై స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతుందనే భావనతో తాత్కాలికంగా కౌంటింగ్ విషయాన్ని వాయిదా వేశారు. త్వరలోనే కౌంటింగ్ తేదీని ప్రకటిస్తామంటూ ఎస్‌ఈసీ ప్రకటించింది.
రెండు దశల్లో ప్రాదేశిక ఎన్నికలు
Published Sun, Mar 30 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM
Advertisement