వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది! | ysr congress party condidate win gudur municipal elections! | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది!

Published Sat, Mar 15 2014 8:10 AM | Last Updated on Tue, May 29 2018 3:35 PM

వైఎస్సార్‌సీపీ  బోణీ కొట్టింది! - Sakshi

వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది!

గూడూరు పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది. ఎన్నికల నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. 33 వార్డుకు వైఎస్సార్‌సీపీ తరపున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆ పార్టీ బోణీ కొట్టినట్లుగా చెప్పవచ్చు. పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న 33వ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తాళ్ల సుబ్బమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఆమెకు డమ్మీ అభ్యర్థిగా రామాబత్తిన వాసవి నామినేషన్ దాఖలు చేసింది. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం ఆ వార్డు నుంచి తాళ్ల సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించడం లాంఛనమే. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆ వార్డు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement