శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు | ysrcp condidate shilpa mohanreddy file nomination for nandyal by-poll | Sakshi
Sakshi News home page

శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Published Sat, Aug 5 2017 1:22 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు - Sakshi

శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన తన  నివాసం నుంచి ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున శిల్పా మోహన్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కూడా రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ సిద్ధం శివరాం, కౌన్సిలర్‌ అనిల్‌ అమృతరాజ్, ముస్లిం మైనార్టీ నాయకుడు ఇసాక్, కానాల విజయశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement