నంద్యాల వైఎస్సార్‌సీపీ నేతలకు గన్‌మెన్లు తొలగింపు | Removal of gunmens for YSRCP leaders at Nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాల వైఎస్సార్‌సీపీ నేతలకు గన్‌మెన్లు తొలగింపు

Published Sun, Nov 19 2017 1:30 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

Removal of gunmens for YSRCP leaders at Nandyal - Sakshi - Sakshi

నంద్యాల అర్బన్‌: కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పూనుకుంది. గతంలో వారికి కేటాయించిన గన్‌మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు స్థానిక వైఎస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శిల్పామోహన్‌రెడ్డికి 2+2 గన్‌మెన్లు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి 2+2, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డికి 1+1, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచనకు 1+1 గన్‌మెన్ల సౌకర్యం లేకుండా ఉత్తర్వులు వెలువరించింది.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం గన్‌మెన్ల తొలగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement