స్థానిక నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా వివిధ పార్టీల నుంచి 171 నామినేషన్లు సమర్పించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి 37, టీఆర్‌ఎస్ 39, టీడీపీ 15, బీజేపీ 19, బీఎస్పీ 3, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తోట రాజేంద్రప్రసాద్ 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
జమ్మికుంట : జమ్మికుంట నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు నాల్గో రోజు నామినేషన్ల జోరు కనిపించింది. వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడి మరీ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరకు 20 వార్డుల నుంచి 72 నామినేషన్లు దాఖలు కాగా కొత్తగా నామినేషన్ వేసిన వారిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. మిగతా 32 మంది మంగళ, బుధవారం వేసి మళ్లీ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. వార్డుల వారీగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే..
నాల్గోరోజు అదే జోరు
Published Fri, Mar 14 2014 3:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement