
సాక్షి, హైదరాబాద్: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 38, టీఆర్‌ఎస్ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది.
ఎంపీటీసీ 665..
తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్‌ఎస్ నుంచి 296, కాంగ్రెస్ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment