first phase elections
-
సార్వత్రిక సమరం: లోక్‌సభ తొలి విడత పోలింగ్ చిత్రాలు
-
Lok Sabha elections 2024: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్ @ 102 నేడే!
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానే‹Ùకుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్‌నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్‌లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు. -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
లోక్‌సభ ఎన్నికలు: నేడే తొలి దశ నామినేషన్లకు చివరి తేదీ
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల మొదటి దశ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నేడు(బుధవారం)తో ముగియనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. అదే విధంగా మార్చి 30న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. ఇక.. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎన్నికలు సంఘం మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనుంది. మొదటి దశలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులో ఒకే దశలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాలకు కూడా మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలను మొత్తం 21 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే దశలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ నాలుగో తేదీన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
లోక్‌సభ సంగ్రామం.. తొలి దశ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక సమరం నేటి(బుధవారం, మార్చి 20) నుంచి ప్రారంభమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు లెజిస్లేటివ్ కౌన్సెల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో బుధవారం ఉదయం ఒక గెజిట్ విడుదలయ్యింది. దీంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లేనని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27. ఆపై 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4వ తేదీన అన్ని దశల ఎన్నికల ఫలితాలతో పాటే విడుదల కానుంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. తొలి దశ వివరాలు నోటిఫికేషన్ తేదీ: మార్చి 20 నామినేషన్ల గడువు: మార్చి 27 నామినేషన్ల పరిశీలన: మార్చి 28 ఉపసంహరణకు ఆఖరు తేదీ: మార్చి 30 పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19 కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 19న మొదలు జూన్ 1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. స్వతంత్ర భారతంలో 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఇవే. లోక్‌సభ ఎన్నికల తొలి దశ.. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి -
ఆ ఆరుగురు మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
UP Assembly Elections 2022: 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి.. 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్ విక్టరీ సాధించింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఓటమి ఆందోళనకు కారణాలు.. ►పశ్చిమ యూపీ రీజియన్.. చెరుకు పంటకు ఫేమస్. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ►జాట్ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. ►జాట్లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం. ►గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది. ►కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి. ►సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్పత్, మేరఠ్, గాజియాబాద్, హాపుఢ్, గౌతమబుద్ధనగర్, బులంద్‌షెహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంబంధిత వార్త: నామినేషన్లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై.. -
బెంగాల్లో 80%, అస్సాంలో 72% పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/మిడ్నాపూర్: పశ్చిమ బెంగా ల్, అస్సాంలో శాసనసభ తొలి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. తొలి దశలో బెంగాల్లో 30, అస్సాంలో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు మాస్కులు, శానిటైజర్లు, పాలిథీన్ గ్లోవ్స్ అందజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించిన ఘటనలు ఈసారి తక్కువగానే రికార్డయ్యాయని ఈసీ తెలిపింది. చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వివరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సివిజిల్ యాప్ ద్వారా బెంగాల్లో 167, అస్సాంలో 582 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు 2 రాష్ట్రాల్లో కలిపి రూ.281.28 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలియజేసింది. బెంగాల్లో 74 లక్షల మంది ఓటర్ల కోసం 10,288 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలో 81 లక్షల మంది ఓటర్ల కోసం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచారు. బెంగాల్లో ఉద్రిక్తతలు తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని కాంతి దక్షిణ్‌లో ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతోందని ఆరోపిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. ఇక మాజ్నా పట్టణంలో తాము ఒక పార్టీకి ఓటు వేస్తే మరోపార్టీకి వేసినట్లు వీవీప్యాట్ స్లిప్పులు వస్తున్నాయని జనం ఆగ్రహించారు. అధికారులు ఇక్కడ వీవీప్యాట్ యంత్రాన్ని మార్చారు. కాంతిదక్షిణ్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని, డ్రైవర్ గాయపడ్డాడని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు ఆరోపించారు. దంతాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మోహన్పూర్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు గాయపడ్డారు. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్తోందని ఆరోపిస్తూ పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేషియారీలో జనం బైఠాయించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. -
కమలానికి కఠిన పరీక్ష
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం, హరియాణాలో మెజార్టీ రాక జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, గత ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన తరుణంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం కఠిన పరీక్ష ఎదుర్కోబోతోంది. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాపై ఈ మధ్య కాలంలో ఓటర్లలో అవగాహన పెరిగిపోయింది. బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. లాలూ ప్రసాద్ యాదవ్ బీజేడీ కూడా విపక్ష కూటమిలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి అంతగా బలం లేదు. మహారాష్ట్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు ఈ కూటమి స్థానిక సమస్యే ఎజెండాగా బరిలో దిగింది. బీజేపీ స్థానిక సమస్యలతో పాటు అయోధ్యలో మందిర నిర్మాణం, కశ్మీర్ అంశాలను ప్రస్తావిస్తూ సుస్థిర పాలన, భద్రత ఎజెండాలుగా చేసుకుంది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సర్కార్ అయిదేళ్లుగా అధికారంలో కొనసాగి రికార్డు సృష్టించింది. వ్యక్తిగతంగా కూడా రఘుబర్ దాస్ ప్రజాకర్షణ కలిగిన నేత. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు. అన్నీ సంకీర్ణాలే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టిన చరిత్ర జార్ఖండ్ ప్రజలకు లేదు. 2014 ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) కూటమికి 41 సీట్లతో సింపుల్ మెజార్టీ వచ్చింది. దీంతో అయిదేళ్లలోనే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైంది. అంతకు ముందు చరిత్ర అంతా ఏ పార్టీకి మెజార్టీ రాక సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలనతో గడిచి అభివృద్ధి అన్నదే ప్రజలు చూడలేదు. సహజవనరులు కలిగిన శాపగ్రస్థ రాష్ట్రం సహజవనరులు అత్యధికంగా ఉన్నప్పటికీ శాపగ్రస్థ రాష్ట్రంగా పేరుపొందిన రాష్ట్రమిది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇటీవల కాలంలో దారిద్య్రం 74.9% నుంచి 46.5శాతానికి తగ్గింది. అయినప్పటికీ రైట్ ఫర్ ఫుడ్ అనే సంస్థ అంచనాల ప్రకారం 2018లో 11 ఆకలి చావులు నమోదయ్యాయి. దేశంలో అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలింది. దీంతో ఉద్యోగాలు, వాణిజ్యానికి అనుకూలంగా తీసుకునే ప్రభుత్వ విధానాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఆదివాసీల సెంటిమెంట్ గత ఎన్నికల్లో బీజేపీ 28 ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో 13 గెలుచుకొని పట్టు బిగించింది. కానీ ఈ సారి గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ పట్టుకోల్పోతోందని అంచనా. గిరిజన గ్రామాల సార్వభౌమత్వాన్ని బీజేపీ అణిచివేస్తోందన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. భూ బ్యాంకుల వ్యవహారం కూడా ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యలు సృష్టిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కమలానిదే హవా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి మొత్తం 14 లోక్‌సభ స్థానాలకుగాను 13 చోట్ల గెలిచి 55.3% ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ స్థాయి మెజార్టీ సాధించగలదా అన్న సందేహాలున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 81 అయిదు దశల్లో ఎన్నికలు నవంబర్ 30, డిసెంబర్ 7, డిసెంబర్ 12, డిసెంబర్ 16, డిసెంబర్ 20న ఎన్నికలు ఫలితాలు వెల్లడి : డిసెంబర్ 23 తొలిదశ పోలింగ్ నేడు! రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని సుమారు 13 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. మొత్తం ఆరు జిల్లాల్లోని ఈ స్థానాల్లో సుమారు 37 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 18 లక్షల మంది మహిళలున్నారు. పదమూడు స్థానాల్లో మొత్తం 189 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటూండగా.. పోలింగ్ కోసం 3,906 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయని, వీటిల్లో 899 స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యం ఉందని ఎన్నికల కమిషన్తెలిపింది. బీజేపీ12 స్థానాల్లో పోటీ చేస్తూండగా, హుస్సేయినాబాద్ స్థానంలో కాషాయ పార్టీ స్వతంత్ర అభ్యర్థి వినోద్ సింగ్‌కు మద్దతిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందిని వాయుమార్గం ద్వారా ఆయా స్టేషన్లకు చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను నిరోధించేందుకు ఫ్లయింగ్స్క్వాడ్లు పనిచేస్తున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. -
నేడే ‘తొలి’ విడత పోలింగ్
సాక్షిప్రతినిధి,ఖమ్మం: తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 6న(నేడు) పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. జిల్లాలోని ఏడు మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనుండగా 7 జెడ్పీటీసీ స్థానాలకు 41మంది అభ్యర్థులు, 112ఎంపీటీసీ స్థానాలకు గాను ముదిగొండ మండలంలోని వల్లభి 1, 2 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 110స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. బందోబస్తుకు పోలీసులు సైతం ఆదివారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బందితో తరలివెళ్లారు. గత నెల 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా 25 వరకు నామినేషన్లు స్వికరించారు. పోలింగ్ జరిగే మండలాలివే.. జిల్లాలో 20 మండలాలు ఉండగా తొలి విడతలో 7 మండలాల్లో (కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముది గొండ, నేలకొండపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 237పోలింగ్ స్టేషన్ల లో 629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 2,99,363మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,46,897 , మహిళలు 1,52,461మంది. ఇతరులు ఐదుగురు ఉన్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను 26 జోన్లుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రవాణాకు ఇబ్బందులు లేకుండా 91రూట్లుగా విభజించి 36కార్లు, 23మినీ బస్సులు, 87పెద్ద బస్సులను ఏర్పాటు చేశారు. ప్రలోభాల పర్వం.. శనివారం సాయంత్రం 5గంటల వరకే ప్రచారం ముగియడంతో ఆ తర్వాత నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు అనేక మంది ప్రత్యేకంగా ఓటర్లను కలుసుకొని తమకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూనే ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంకలు వేర్వేరుగా సందర్శించారు. కామేపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించగా, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లోని కేంద్రాలను జెడ్పీ సీఈఓ ప్రియాంకలు సందర్శించి పలు సూచనలు చేశారు. -
తొలి అంకానికి తెర
సాక్షి, మెదక్: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల (హవేళిఘణాపూర్, పాపన్నపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట) పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 357, జెడ్పీటీసీ స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలాల పరిధిలో మొత్తంగా 65 ఎంపీటీసీ స్థానాలుండగా.. 433 నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 25న (నేడు) నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 26న విజ్ఞప్తుల స్వీకరణతోపాటు 27న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 28న ఉపసంహరణ అనంతరం అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే ఆరో తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. మండలాలు, పార్టీల వారీగా ఇలా.. హవేళిఘణాపూర్ మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 9, సీపీఎం, టీడీపీ నుంచి ఒకటి చొప్పున, కాంగ్రెస్ నుంచి 22, టీఆర్ఎస్ నుంచి 40, స్వతంత్రుల నుంచి 15 నామినేషన్ల చొప్పున మొత్తం 88 దాఖలయ్యాయి. అదేవిధంగా ఒక జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. పాపన్నపేట మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి 36, టీఆర్ఎస్ నుంచి 57, స్వతంత్రుల నుంచి 11.. మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. టేక్మాల్ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్ నుంచి 26, టీఆర్ఎస్ నుంచి 31, స్వతంత్రుల నుంచి తొమ్మిది.. మొత్తం70 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి నాలుగు.. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అల్లాదుర్గం మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి రెండు, కాంగ్రెస్ నుంచి 20, టీఆర్ఎస్ నుంచి 26, టీజేఎస్ ఒకటి, స్వతంత్రుల నుంచి 13.. మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 5, టీఆర్ఎస్ నుంచి 4, స్వతంత్ర ఒకటి.. మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 17, టీఆర్ఎస్ నుంచి 32, స్వతంత్రుల నుంచి 10.. మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి మూడు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రేగోడ్ మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 18, టీఆర్ఎస్ నుంచి 27, స్వతంత్రుల నుంచి ఒక నామినేషన్.. మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి నాలుగు, స్వతంత్ర రెండు.. మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వివరించారు. ఇక ప్రచార పర్వం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయిన నేపథ్యంలో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో పోరు రసవత్తరంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారానికి కసరత్తు చేస్తున్నారు. టీడీపీ కనుమరుగు.. ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ.. ప్రస్తుతం కనుమరుగైందనే చెప్పాలి. మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆ పార్టీ నుంచి ఒక్కచోట మాత్రమే నామినేషన్ దాఖలైంది. హవేళి ఘణాపూర్‌లో టీడీపీ అభ్యర్థి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. వామపక్షాల ప్రాబల్యం తగ్గిందనడానికి తొలి విడతలో దాఖలైన నామినేషన్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హవేళిఘణాపూర్ నుంచి ఒకరు సీపీఎం తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ అభ్యర్థులు ఎవరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం గమనార్హం. టీజేఎస్ సైతం ఈ ఎన్నికల బరిలో లేదు. అల్లాదుర్గం మండలంలో టీజేఎస్ తరఫున ఒకరు మాత్రమే దాఖలు చేయడం విశేషం. తొలి అంకానికి తెర -
తొలిరోజు ‘జెడ్పీటీసీ’కి 91 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 38, టీఆర్ఎస్ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. ఎంపీటీసీ 665.. తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 296, కాంగ్రెస్ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
‘తొలి దశ’కు అంతా సిద్ధం
నెలరోజులుగా చెవులు చిల్లులు పడేలా హోరెత్తిన తొలి దశ ఎన్నికల ప్రచార యుద్ధం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఇక గురువారం జరగబోయే పోలింగ్‌కు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ప్రచారపర్వం సందర్భంగా ప్రధాన పార్టీల నాయకులు అవిశ్రాంతంగా ప్రచారసభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. కొన్ని సందర్భాల్లో విమర్శలు కట్టుదాటాయి. ఎన్నికల నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని చక్క దిద్దవలసి వచ్చింది. గత నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వ హించబోతున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలుంటాయని తెలిపింది. తొలి దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని లోక్‌సభ స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మరో 15 రాష్ట్రాల్లోని 49 స్థానాలు కూడా తొలి దశ పోలింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విభజన తర్వాత తొలిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు రివాజే. సాధారణ సమయాల్లో తమపై వచ్చే ఆరోపణల గురించి పట్టనట్టు ఉండే పాలకపక్షం ఎన్నికల్లో విమర్శలనూ, ఆరోపణ లనూ తీవ్రంగా పట్టించుకుంటుంది. వాటికి జవాబిస్తుంది. కనుకనే ఎన్నికల ప్రచార పర్వంలో ఇంతక్రితం మరుగున పడిపోయిన సమస్యలన్నీ పైకొస్తాయి. తమ పరిష్కారం మాటేమిటని నిల దీస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ప్రత్యర్థి పక్షాలే తప్ప శత్రువులు కాదు. కానీ ఏపీలో పాలక తెలుగుదేశం ఇందుకు భిన్నమైన ధోరణి అవలంబించింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ప్రచారాన్ని సాగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిందేమిటో చెప్పుకోలేని స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రజలు నమ్మే అవకాశం లేదని తెలిసినా అబద్ధాలు గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తెలం గాణపై అకారణంగా ఆరోపణలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీ, టీఆర్ఎస్లతో రహస్య అవగాహన ఉందని ఆరోపించారు. నరేంద్రమోదీకి లొంగిపోయారని విమర్శించారు. ప్రచారం చివరికొచ్చేసరికి ఆయన మరింత దిగజారారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే హత్యలు, దోపిడీలు జరుగుతాయంటూ ఇష్టానుసారం మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి గురించి ఏం చెప్పినా ప్రజలను నమ్మించలేకపోతున్నానని అర్ధమయ్యాక ఆయన స్వరం మరింత హెచ్చింది. ఆరోపణల తీవ్రత కూడా పెరిగింది. చివరికిది ఏ స్థాయికి చేరుకుందంటే తెలుగుదేశం పార్టీని అమితంగా ఇష్టపడేవారు సైతం ఆయన ప్రసంగాల ధాటికి తట్టుకోలేకపోయారు. ఈ అయిదేళ్లూ చంద్రబాబు నిజంగానే చేసిందేమీ లేదా అన్న మీమాంసలో పడిపోయారు. ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా పచ్చమీడియా నిలబడింది. అబద్ధాలను పుక్కిటబట్టింది. కానీ సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటంతో ఇవన్నీ నీరుగారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ అధి కార దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఎన్నికల సంఘం పాక్షికంగా మాత్రమే విజయం సాధిం చింది. సకల ఆధారాలనూ చూపినా కొందరు అధికారులపై చర్య తీసుకోవడంలో విఫలమైంది. చంద్రబాబులో ఏర్పడిన నిరాశానిస్పృహలకు కారణమేమిటో తెలుగు ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. బాబు ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అవరోధాలను అధిగమిస్తూ ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లపాటు నిలకడగా ఉద్యమం కొనసాగించారు. విద్యా ర్థుల్లో, యువతలో చైతన్యాన్ని నింపారు. పర్యవసానంగా అది ప్రజల బలమైన ఆకాంక్షగా రూపు దిద్దుకుంది. దీనికితోడు ఆయన చేసిన ‘ప్రజాసంకల్పయాత్ర’ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేసింది. తమ సమస్యలను విని, తమ కష్టాలు తెలుసుకుని భరోసానిస్తున్న జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఆప్తుడిగా భావించారు. పరిస్థితి చేయిదాటుతున్న ఈ స్థితిలో తన వైఫల్యాలన్నిటినీ కేంద్రంపైకి తోసి, ప్రత్యేకహోదా అంశాన్ని తానూ తలకెత్తుకోవడం ఒకటే పరిష్కారమని చంద్రబాబు అనుకున్నారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్‌తో ఊరేగితే ఈ కష్టాలనుంచి గట్టెక్కవచ్చునని అంచనా వేసుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయన ఆశల్ని భగ్నం చేశాయి. చెట్టపట్టాలు వేసుకుని వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కూటమిని ఆ ఎన్నికల్లో జనం నిష్కర్షగా తిరస్కరించారు. ఏపీలో ఈ పొత్తువల్ల వీసమెత్తు లాభం లేకపోగా ఉభయత్రా మరింత చేటు కలుగుతుందని గుర్తించి రెండు పక్షాలూ దూరం జరిగాయి. అలాగని ఆయన ఒంటరిగా ఏం లేరు. కాంగ్రెస్‌తో, జనసేనతో రహస్య అవగాహన కొనసాగింది. దాన్ని చాలా సులభంగానే ప్రజలు పసిగట్టారు. బాబు రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఈ నిస్సహాయస్థితే ఆయనతో ఇష్టానుసారం మాట్లాడించింది. డబ్బులు పంచుదామంటే ఐటీ వెన్నాడుతోందని, అందుకే ప్రభుత్వ సొమ్మును ‘శుభ్రం’గా పంచేశానని ఓ సభలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు. తన సంపాదన లక్ష కోట్లని ఆయన ఒకచోట నోరుజారారు. వైఎస్సార్‌కాంగ్రెస్ హుందాగా ప్రచారం సాగించింది. ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. సమస్యలపై నిలదీశారు. విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. తాము వస్తే ఏం చేయదల్చుకున్నామో చెప్పారు. ఈ అయిదేళ్లూ ఏలికలుగా ఉన్న వారు ఏం చెప్పి అధికారంలోకొచ్చారో, ఏం చేశారో ప్రజలకు తేటతెల్లమే. ఇక తమ వజ్రాయుధం ఓటు హక్కును వినియోగించి తీర్పునివ్వడమే తరువాయి. అందుకు మరొక్క రోజు మాత్రమే గడువుంది. -
16 పంచాయతీలు ఏకగ్రీవం
నల్లగొండ : మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నల్లగొండ డివిజన్లో 257 గ్రామపంచాయతీలు ఉండగా ఉపసంహరణ ముగిసే సమయానికి ఒకే నామినేషన్ ఉండడంతో 16 గ్రామ పంచా యతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. నల్ల గొండ డివిజన్ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రిటర్నింగ్అధికారి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీలు, 21న అప్పీళ్ల పరిష్కారం, 22 మంగళవారంమధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగింది. గడువు ముగిశాక 16 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒకే నామినేషన్ ఉండడంతో వాటిని ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మూడో విడతలో తగ్గిన ఏకగ్రీవాలు మొదటి, రెండో విడతలతో పోల్చుకుంటే మూడో విడత గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు తగ్గాయి. మొదటి విడతలో 52, రెండో విడతలో మరో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడో విడత జరిగే నల్లగొండ డివిజన్లో మాత్రం ఏకగ్రీవాల సంఖ్య తగ్గింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే, మునుగోడు నియోజకవర్గంలో రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. నల్లగొండలో మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. అధికార పక్షం ఏకగ్రీవానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. చాలా చోట్ల ప్రతిపక్షాల కంటే స్వపక్షం నుంచే పోటీ ఎక్కువైంది. ఇది టీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది. దీంతోనే నల్లగొండ డివిజన్లో ఏకగ్రీవాల సంఖ్య తగ్గిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 241 పంచాయతీలకు ఎన్నికలు నల్లగొండ డివిజన్ పరిధిలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 241 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి పోటీలో ఉన్న వారి జాబితాను ప్రకటించి ఎన్నికల గుర్తులను కూడా కేటాయించారు. ఏకగ్రీవమైన గ్రామాలు నల్లగొండ మండలంలో పెద్ద సూరారం, ఖుదావన్‌పూర్, మునుగోడులో దుబ్బకాల్వ, తిప్పర్తి మండలంలో కంకణాలపల్లి, చండూరు మండలంలోని ఉడతలపల్లి, జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, పడమటితాళ్ల, బోడంగిపర్తి, చొప్పవారిగూడెం, నార్కట్‌పల్లి మండలంలో షేరిబాయిగూడెం, కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, ఇస్లాంనగర్, మారెపల్లి గౌరారం, నకిరేకల్ మండలంలో నడిగూడెం, కట్టంగూర్ మండలంలో రామచంద్రాపురం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అధికం టీఆర్ఎస్సే... నల్లగొండ డివిజన్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీ వం కాగా అందులో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే అధికంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. -
నేడే గ్రామ పంచాయతీ ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలి విడత గ్రామ పంచాయతీ పోరు సోమవారం జరగనుంది. మొత్తం 159 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,341 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తద్వారా ఆయా పంచాయతీలను ఐదేళ్లపాటు పాలించేదెవరో తేలిపోనుంది. ఏకగ్రీవమైన 20 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరగవు. సర్పంచ్ పదవుల కోసం 471 మంది, వార్డుల సభ్యుల కోసం 3,292 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోల్ చిట్టీల పంపిణీ పూర్తి ఈ ఎన్నికల్లో రెండు రకాల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు బ్యాలెట్‌ను సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయడానికి, తెలుపు బ్యాలెట్ పేపర్ని వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగిస్తున్నారు. ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ఆయా మండలాల్లోని 1.90 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వీరందరికీ ఫొటోతో కూడిన పోలింగ్ చిట్టీని అందజేశారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి వీటిని పంపిణీ చేశారు. ఓటు వేయడానికి పోలింగ్ చిట్టీ ఉంటే సరిపోతుంది. ఇతర ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఒకవేళ పోలింగ్ చిట్టీ లేకుంటే ఫొటో ఓటరు గుర్తింపు కార్డుని అనుమతిస్తారు. ఇది కూడా లేకుంటే ఆధార్ కార్డుతో సహా ఎన్నికల విభాగం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ఎన్నికలు జరిగే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే భవనం ఆవరణలో అన్ని వార్డుల పోలింగ్ కేంద్రాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని యంత్రాంగం అందుబాటులో ఉంచింది. వికలాంగులు సులువుగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వీల్‌చైర్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత కోసం పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడడం నిషేధం. ఫలితాలు వెల్లడయ్యే వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తప్పవని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏరులై పారుతున్న మద్యం పంచాయతీ పోరులో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. సర్పంచ్ పదవిని కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు మద్యం, డబ్బుల పంపిణీతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు పోటాపోటీగా విందులు ఇస్తూ తమ చేజారిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతగా దృష్టి పెట్టకపోవడంతో మద్యం పంపిణీ హద్దులు దాటుతోంది. ఫిర్యాదు చేస్తే తప్పా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పలు పల్లెల్లో స్థానికంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన అభ్యర్థులు.. ఓటర్లందరినీ హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పిలిపిస్తున్నారు. అక్కడి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో దావత్‌లు ఇస్తున్న దృశ్యాలు విరివిగా కనిపిస్తున్నాయి. ఎలాగైన పదవి దక్కించుకోవాలనే తపనతో తమకే ఓటు వేయాలని ఓటర్లతో కొందరు అభ్యర్థులు ప్రమాణం కూడా చేయించుకుంటుండటం గమనార్హం. రాజకీయ రంగు.. పార్టీల రహితంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. వీటికి రాజకీయ పార్టీల రంగు పులుముకుంది. అధికార టీఆర్ఎస్ నేతలు బలపర్చిన అభ్యర్థులు వారి పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం సాగించారు. ఆ పార్టీ ఆశీస్సులు లభించనివారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేస్తూ గెలిచిన తర్వాత అదే పార్టీలోకి వెళ్తామంటూ ప్రచారాన్ని సాగించారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులు కూడా ముమ్మర ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు.. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతుండడం గమనార్హం. -
తొలి సమరం నేడే
ఆత్మకూరు(పరకాల): ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్లె పోరు మొదటి దశ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంది. జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బ్యాలెట్ బాక్స్‌లు, సిబ్బందిని తరలించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచారు. జోరుగా సాగిన ప్రచారం శనివారంతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా మరికొన్ని గంటల్లో సర్పంచ్‌గిరి ఎవరిని వరించనుందో తేలనుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుపై తమకు వచ్చే ఓట్లను లెక్కలేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చిన పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలో తొలి దశలోనే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎక్కువ స్థానాలు గెలిచి రెండు, మూడో విడత ఎన్నికల్లో ప్రభావం చూపాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి.సోమవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగుతుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆతర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్ ఎంపిక ఉంటుంది. నేడు తొలివిడతలో 145 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 100 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌కు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కావడానికి అధికార పార్టీ నేతలు ఈ సారి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. గతంలో కంటే పెద్దమొత్తంలో సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యులు ఏకగ్రీవమవడం విశేషం. 1535 బ్యాలెట్ బాక్సులు సిద్ధం.. మొదటి విడత పోలింగ్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి సామగ్రిని అందజేశారు. ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందచేశారు. మొదటి విడత ఎన్నికలకు 1264 పోలింగ్స్టేషన్లను సిద్దం చేశారు.వీరికి 1535 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. దుగ్గొండి మం డలంలో 282 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేసి 344 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు.నర్సంపేట మండలంలో 238 పోలింగ్ స్టేషన్లకు 289 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేశారు. పర్వతగిరి మండలంలో 288 పోలింగ్స్టేషన్లకు 350 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సంగెం మండలంలో 286 పోలింగ్స్టేషన్లకు 348 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. వర్ధన్నపేట మండలంలో 170 పోలింగ్ స్టేషన్లకు 205 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. 3015 మంది సిబ్బంది.. మొదటివిడత పోలింగ్‌కు 3015 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 43 మంది స్టేజ్–1ఆర్ఓ, 43 మంది స్టేజ్–1 ఏఆర్ఓ, 145 మంది స్టేజ్–2 ఏఆర్ఓ, 1264 మంది పీఓ, 1454 ఓపీఓలు, 44 మంది రూట్ ఆఫీసర్లు, 22 మంది జోనల్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. ఒకేరోజు పోలింగ్, ఫలితాలు.. నేడు(సోమవారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇదే రోజు సాయంత్రం వరకు లెక్కింపు జరుగుతుంది. ఒకే రోజులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్నో ఆశలతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. అభ్యర్థులు గ్రామాల్లో శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఓటు కీలకమే.. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎన్నికల్లో కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు ప్రతి ఓటుపై దృష్టి పెడుతున్నారు.దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లలో ఆఫర్లు చెబుతూ పోలింగ్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే గ్రామాల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా నేడు రాత్రివరకు నూరు పంచాయతీల సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్లు సమానంగా వస్తే టాస్.. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారింది. తక్కువ ఓటర్లుండి ఎక్కువ అభ్యర్థులు పోటీ ఉన్న చోట ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ వేయడం లేదా చిట్టీలు తీయడం వంటి పద్ధతులను అనుసరించనున్నారు. అయితే అభ్యర్థులు మాత్రం పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఓటును బ్యాలెట్ బాక్స్‌కు చేరాలా అభ్యర్థులు గ్రామాల్లో ఓటు హక్కు ఉండి నగరాల్లో విద్య, ఉద్యోగాలు చేస్తున్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి చేరుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్: తొలిదశ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం
-
బీహార్ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకుగాను 586 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టదిట్టమైన భద్రత చర్యలు చేసినట్లు అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ అఫీసర్ ఆర్ లక్ష్మణన్ సోమవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 1,35,72,339 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. 10 జిల్లాల్లో మొత్తం 13212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే అత్యధిక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందన్నారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రదేశాల్లో పోలింగ్ సాయంత్రం 3.00 గంటలు, మరికొన్ని చోట్ల సాయంత్రం 4.00 గంటలకు ముగియనుందని చెప్పారు. మొదటి దశలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 54 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. బీహార్ శాసనసభకు మొదటి దశ అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి... ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది నవంబర్ 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. -
జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!
ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలాయి. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది. తొలి విడతలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% పోలింగ్ రికార్డయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో అయితే కనిష్ఠంగా కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ స్థితి నుంచి క్రమంగా బయటపడి.. ఇప్పుడు 70% పోలింగ్ నమోదుచేసే స్థితికి జమ్ము కాశ్మీర్ చేరుకుంది. ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు సహా మొత్తం 132 మంది అభ్యర్థులు తొలిదశలో పోటీపడ్డారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం చలి కారణంగా పోలింగ్ కొంత మందగించినా, మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. బండిపురా ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం బయట బాంబు పేలింది. అలాగే ఇదే ప్రాంతంలో మరోచోట కూడా మధ్యాహ్నం ఇంకో బాంబు పేలింది. అయినా.. ఓటర్లు మాత్రం చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారు. -
‘టీ’ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలోభాగంగా బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 9 చివరి తేదీ. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు 12వ తేదీ చివరి రోజు. ఈనెల 30న ఎన్నికలు నిర్వహించి మే 16న ఫలితాలు వెల్లడిస్తారు. మరో 6 రాష్ట్రాల్లోని 72 స్థానాలకూ నోటిఫికేషన్: తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు మరో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 72 స్థానాలకూ ఏడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. గుజరాత్లో 26 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలు, బీహార్‌లో 7, జమ్మూకాశ్మీర్, డామన్ డయూ, దాద్రా నగర్ హవేలీలలో ఒక్కో సీటుకు ఈ దశ కింద ఎన్నికలు జరగనున్నాయి.