
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టుమేన్‌లా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడంపై కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుపతితోపాటు ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అక్రమ కేసులు మోపుతున్నారని ఆరోపించారు.