అచ్చెన్నాయుడు.. ఈ జన్మకి నీ కోరిక తీరదు: ఎంపీ విజయసాయి రెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Atchannaidu Over His Statement, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడు.. ఈ జన్మకి నీ కోరిక తీరదు: ఎంపీ విజయసాయి రెడ్డి

Published Thu, Sep 26 2024 9:37 AM | Last Updated on Thu, Sep 26 2024 11:02 AM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Atchannaidu

సాక్షి, ఢిల్లీ: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అంటూ ప్రశ్నించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. 
అచ్చంనాయుడూ! 
దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి.. కచ్చి.. అని ఆట పట్టించేవారట కదా!  దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?.

అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు కుట్రకు పోలీసు వత్తాసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement