
టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టంలా కనిపిస్తోంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్కు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ...నేడు వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం నగర పాలక సంస్థ, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పోటీ చేసిన ప్రతి చోట ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారు.
వరంగల్‌లో 51 డివిజన్లలో, ఖమ్మంలో 48 డివిజన్లలో, అచ్చంపేటలో 4 వార్డులలో పోటీ చేసిన టీడీపీ ఏ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో షాక్ల మీద షాక్లు తగులుతున్న టీడీపీకి ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట నగర పంచాయతీ ఫలితాలు మరో షాక్.