
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్‌జెండర్ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్‌జెండర్ సమితి నాయకులు జరీనా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్ సమితి కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment