ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు | Telugu people give historical Judgment over Municipal elections | Sakshi
Sakshi News home page

ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు

Published Tue, May 13 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు

ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు

మున్సిపల్ ఫలితాలపై బాబు వ్యాఖ్య
 సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న ఆయన పేరుతో పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ పట్ల విశ్వాసం ఉంచి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ తీర్పును స్పష్టంగా, టీడీపీని బలోపేతం చేసే విధంగా ఇచ్చారని పేర్కొన్నారు.
 
 పార్టీ నేతలు, కార్యకర్తల కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. టీడీపీ విధానాల పట్ల ప్రజలకున్న అపార నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే సెంటిమెంట్‌తో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలను కొంత మేరకు ప్రభావితం చేయటం వల్ల తమకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో తమ వెన్నంటి ఉన్న ప్రజలకు భవిష్యత్‌లో అండగా ఉంటామని చెప్పారు. కాగా, పురపాలక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement