'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు' | it is the time show power of telugu people: ambati | Sakshi
Sakshi News home page

'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు'

Published Fri, May 6 2016 1:47 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు' - Sakshi

'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు'

హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇంకా కేంద్రంలోనే ఉండటం సిగ్గు చేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీపడుతున్నారని అన్నారు. తెలుగువారి పౌరుషం చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10న వైఎస్ఆర్ సీపీ నిర్వహించే ధర్నాలకు అందరూ మద్దతివ్వాలని అంబటి కోరారు.

ప్రత్యేక హోదా కోసం 10న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా ఉంటుందని చెప్పారు. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని, మరీ బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మొదటి ముద్దాయి చంద్రబాబునాయుడని అన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా మోదీ కేసీఆర్ వద్ద ఉందని అందుకే.. స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేయడం లేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement