
సాక్షి, విజయవాడ: అడుగడుగునా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోన్న చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని, కేవలం మాత్రం మీడియాలో వార్తల కోసమే ఆయన ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా ఉంచింది ఒక్క వైఎస్సార్‌సీపీనే అని గుర్తుచేశారు.
తుప్పుపట్టిన సైకిల్ కోసం: ‘‘రాష్ట్రంలో ఏ ఒక్కరూ చంద్రబాబును నమ్మే పరిస్థితిలేదు కాబట్టే ఆయన పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి ఎవ్వరూ వెళ్లడంలేదు. నమ్మినవారిని నట్టేటముంచే చంద్రబాబుపై ప్రజలకు ఎప్పుడో నమ్మకంపోయింది. ఒక్క లోకేశ్‌ని తప్పితే, ఆఖరికి కుటుంబీకులను కూడా బాబుగారు నమ్మరు. ఆ తుప్పుపట్టిన సైకిల్ కోసమే లోకేశ ఆరాటపడుతున్నారు’’ అని అంబటి అన్నారు.
టీడీపీ ఎంపీలు రాజీనామాలు చెయ్యాలి: హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తోన్న విషయాన్ని గుర్తుచేసిన అంబటి రాంబాబు.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలతో రాజీనామాలు చేయించాల్సిందిపోయి చంద్రబాబు క్షణానికో మాట మాట్లాడుతూ మాయలఫకీరులా తయారయ్యారని, రాజకీయ రణక్షేత్రంలో ఆయన ఏకాకిలా మిగిలిపోక తప్పదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment