నిజామాబాద్ కార్పొరేషన్లో ఉద్రిక్తత | tension prevails in nizamabad corporation elections | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ కార్పొరేషన్లో ఉద్రిక్తత

Published Thu, Jul 3 2014 11:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

tension prevails in nizamabad corporation elections

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు తెలిపింది. దీంతో మజ్లిస్ మద్దతుతో కార్పొరేషన్ మేయర్ పదవి టీఆర్ఎస్ అభ్యర్థికి దక్కే అవకాశం ఏర్పడింది.

అయితే.. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి చేశారు. ఈ పరిస్థితి మధ్యనే ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. స్థానిక ఎంపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఓటు కూడా ఇక్కడ కీలకం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement