బాబువి..దిగజారుడు రాజకీయాలు
బాబువి..దిగజారుడు రాజకీయాలు
Published Sun, Nov 6 2016 9:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– ముస్లిం మైనార్టీ ఓటర్ల కోసమే పాదయాత్ర
– వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రావు
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ధ్వజం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డాడు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజాధనం వృథాకావడం తప్ప ప్రయోజనం ఉండదనా్నరు. రెండున్నరేళ్లలో సీఎం కర్నూలుకు 13 సార్లు వచ్చి 23 హామీలు ఇచ్చారని, అందులో ఒక్కదానిని కూడా నెరవేర్చాలేదని, ఇందుకు దమ్ముంటే టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీ ఓటర్ల కోసం పాతబస్తీలో పాదయాత్ర చేసినా, పడుకొని పోయినా వారు బాబును నమ్మరని పేర్కొన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఆ ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి నిరోధక పార్టీగా సీఎం ఆనడం దారుణమన్నారు. తమ పార్టీ అధినేత జగన్, తాము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో మంచి పనులకు తమ సహకారముంటుంందని ఈ విషయాన్ని టీడీపీ నాయకులు గమనించాలని హితవు పలికారు. 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారన్నారు. అందులో గుండ్రేవుల రిజర్వాయర్, టెక్స్‌టైల్ పార్కు, జింకలపార్కు, మైనింగ్ యూనివర్సిటీ ఉన్నాయన్నారు. హామీలిచ్చి రెండేళ్లు గడిచినా అతీగతీ లేదనా్నరు. తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన అన్నదాతలను ఇప్పటి వరకు ఆదుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.
దళిత ఎమ్మెల్యేకు అవమానం
కోల్స్ కళాశాలలో జరిగిన పార్టీ సమావేశంలో దళిత ఎమ్మెల్యే మణిగాంధీకి అవమానించారని బీవై రామయ్య అనా్నరు. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియకు సీఎం సభలో కూర్చునేందుకు సీటు లేకుంటే దళిత ఎమ్మెల్యే అయినా మణిగాంధీని లేపి వారిని కూర్చోబెట్టడం దారుణమన్నారు. టీడీపీలోకి వెళ్లిన వలస నాయకులకు అక్కడ ఎలాంటి మర్యాద ఉందో ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు.
పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్: హఫీజ్ ఖాన్
కర్నూలు నగరంలో సీఎం పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్ అయిందని, నగరవాసులెవరూ ఆయన వెంట నడవలేదని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ముఖ్యమంత్రి నగరానికి వరద రక్షణ గోడ , అండర్ డ్రెయినేజి, సుద్ధవాగు, రోడ్ల నిర్మాణానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. ముస్లింలను మభ్యపెట్టేందుకు ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించిన దానికి ఇంతవరకు సెంటుభూమి, ప్రొఫెసర్లను నియమించలేదన్నారు. దోమలపై దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం నగరంలో ఎక్కడ దోమలు లేకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
మంచినీటి సమస్యను పట్టించుకోని సీఎం– నరసింహులు యాదవ్
కర్నూలు నగర జనాభా పెరగడంతో కొన్ని కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని వైఎస్‌ఆర్‌సీపీ నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. అయితే, నీటి సమస్య పరిష్కారానికి సీఎం ఎలాంటి హామీ ఇవ్వకపోవడాన్ని బట్టి ఆయనకు కర్నూలు ప్రజలపై ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలిసిపోయిందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, నాయకులు మద్దయ్య, జహీర్‌అహ్మద్‌ఖాన్, ఫిరోజ్‌ఖాన్, గోపీనాథ్‌యాదవ్, భాస్కరరెడ్డి, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement