కరీంనగర్:పార్టీల టికెట్ల కేటాయింపులో నేతల అనుసరిస్తున్న వైఖరి కార్యకర్తల్లో అసహనం కలగజేస్తోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా నేతలు వారి అనుచరులకే పెద్ద పీట వేయడం కాస్తా కొంతమంది కార్యకర్తలు అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నంచేసిన ఘటన మంగళవారం సంభవించింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండం కార్పోరేషన్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు.
కార్పోరేషన్ టికెట్ల కేటాయింపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన అనుచరులకే టికెట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాడని ఆరోపిస్తూ అదే పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.