హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలకు బుధవారం మధ్యాహ్నంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఖమ్మం కార్పొరేషన్లో 50 డివిజన్లకు 587 నామినేషన్లు, వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లకు 1350 నామినేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో 20 వార్డులకు 135 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు శుక్రవారం వరకు గడువు ఉంది. మార్చి 6వ తేదీన పోలింగ్, మార్చి 9న ఫలితాలు వెలువడనున్నాయి.