కలసి కదనం!
కొత్త ఏడాదిలో సీపీఐ దూకుడు
- కాంగ్రెస్, టీడీపీలతోనూ ఐక్యకార్యాచరణకు సంసిద్ధత
- ఏప్రిల్, మేల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో దూకుడుగా ముందుకెళ్లాలని, రాజకీయంగా మరింత క్రియాశీలంగా వ్యవ హరించాలని సీపీఐ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ముఖ్య సమస్యలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామ్య వైఖరి, వైఫ ల్యాలపై కలిసొస్తే కాంగ్రెస్, టీడీపీలతో కలసి ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు టీజేఏసీ, ప్రజాగాయకుడు గద్దర్, ఇతర సామాజిక శక్తులు, సంస్థలతో కలసి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై కలసి పనిచేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో వామపక్ష, ప్రజాస్వామ్య, సెక్యులర్ శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని భావిస్తోంది. విశాల ప్రాతిపది కన కలసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని, బీజేపీ తప్ప ఎవరూ తమకు అంటరాని వారు కాదని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మరో రెండున్నరేళ్లలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున చట్టసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శుక్రవారం ముగిసిన రాష్ట్ర సమితి సమావేశంలో ప్రధానంగా సంస్థాగ తంగా పార్టీని బలోపేతం చేసుకుని మార్చి నుంచి కార్యక్షేత్రంలోకి దూకి ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురైనా కేసులకు సైతం వెరవకుండా భూపోరాటాలు, ప్రజా ఉద్య మాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని మండలాలు, గ్రామాలు పార్టీకి కనీస ప్రాతినిధ్యం ఉండేలా చూడాల ని తీర్మానించారు. జిల్లాలు, మండలాల్లోని ఆయా స్థానిక సమ స్యలపై పోరును ఉధృతం చేయాలని, నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు, వివిధ రూపాల్లో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు. మొత్తం రాష్ట్రాన్ని చుట్టి వచ్చేలా ఏప్రిల్, మేలో బస్సుయాత్రను చేపట్టాలని నిర్ణయించారు.