
సాక్షి, వికారాబాద్: వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన శుక్రవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లికి చెందిన మీనా వైద్యం కోసం మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడ నర్సులు వైద్యం చేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడంతో వెంటనే 108 వాహనంలో సదాశివపేటకు తరలించగా.. వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణి మార్గమధ్యలోనే మృతి చెందింది. వైద్య సేవల్లో జాప్యం చేయడం వల్లనే మీనా మృతిచెందిందని ఆరోపిస్తూ.. మృతురాలి కుటుంబసభ్యులు మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment