Pregnant woman died
-
మృత శిశువుకు జన్మనిచ్చి తల్లి మృతి
భైంసాటౌన్: కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చి తర్వాత కాసేపటికి తానూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాకు చెందిన రాథోడ్ మనోజ్ తన భార్య శీతల్ (25)కు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయతి్నంచారు. అయితే నొప్పులు ఎక్కువ కావడం, కాన్పు కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా.. ఆ కాసేపటికే శీతల్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
గర్భిణి దుర్మరణం
దొడ్డబళ్లాపురం: లారీ ఓ స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి మహిళ దుర్మరణం పాలైంది. ఆమె కడుపు బద్ధలై గర్భస్త శిశువు బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ ఘోరం నెలమగల తాలూకా ఎడేహళ్లి గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గర్భిణి సించన (20) భర్తతో కలిసి స్కూటర్‌పై ఎడేహళ్లి వద్ద సరీ్వస్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారి ఢీకొంది. సించన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, పొట్ట చీలిపోవడంతో గర్భస్థ పిండం బయటకు వచ్చింది. భర్త మంజునాథ్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ దారుణాన్ని చూసి అగ్రహోదగ్రులైన స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దారుణం.. కడుపులో ఉన్నది తన బిడ్డ కాదన్న రెండో భర్త.. కాలితో తన్నడంతో
సాక్షి, చెన్నై: కండాచ్చిపురంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతి అని కూడా చూడకుండా కాలితో తన్నడంతో గర్భస్రావంతో భార్య మృతిచెందింది. వివరాలు.. తిరుకోవిలూరు కండాచ్చిపురం సమీపంలోని వీరంగిపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె భారతి (23) చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు సూరకోటకు చెందిన ఈశ్వరన్‌తో పరిచయం ఏర్పడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం ఇద్దరూ విడిపోయారు. భారతి తన కుమారుడితో కలిసి వీరంగిపురం కులత్తుమెట్టు వీధిలోని అత్త లక్ష్మి ఇంట్లో ఉంటోంది. మలవతంగాల్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సెల్వపాండియన్ (30)తో పరిచయం ఏర్పడి రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఈ క్రమంలో కడుపులో ఉన్నది తన బిడ్డకాదని, ఆబార్షన్ చేసుకోవాలని సెల్వపాండియన్ భార్యను కోరడంతో ఆమె నిరాకరించింది. ఆవేశానికి గురైన సెల్వపాండియన్ భారతిని కిందకు తోసి ఆమె కడుపుపై తన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో గురువారం మృతి చెందింది. భారతి తండ్రి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కండాచ్చిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్వపాండియన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని బాధితులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక (31) భార్యాభర్తలు. కాగా శ్రీకాంత్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆల్వాల్‌లోని సాయిబాబానగర్‌లో నివాసముంటున్నాడు. మౌనిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్‌సీఏల్ నార్త్‌లో ఉన్న అంకుర ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి మౌనిక ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో ఫిట్స్ రావడంతో గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన మౌనిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: జాగ్రత్త సుమా!.. అధికారులకు కేటీఆర్ హెచ్చరిక.. -
పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తొలి కాన్పుతో అమ్మతనం ఆస్వాదించాలని ఆమె ఎన్నో కలలు కన్నది. గర్భందాల్చిన నాటి నుంచే పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ మురిసిపోయింది. నెలనెలా పెరుగుతుంటే తన్మయం పొందింది. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పు కాకుండానే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం జరిగింది. అసలేం జరిగింది.. ఆదిలాబాద్ పట్టణం పుత్లీబౌళి సమీపంలోని కేవీ.నగర్‌కు చెందిన కొర్రి రాజుకు గతేడాది జూలై 1న ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన అక్షిత(22)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. గురువారం పురుటినొప్పులు రావడంతో సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం ఉందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో మళ్లీ నొప్పులు రావడంతో ఈ విషయాన్ని సమీపంలోని ఆశ కార్యకర్తకు తెలియజేశారు. దీంతో ఆమె అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిమ్స్‌కు 4 గంట లకు చేరుకున్నారు. ఆ తర్వాత మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. వారు అక్షితకు ఇంజెక్షన్ ఇచ్చా రు. ఎలాంటి చికిత్స చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు గర్భిణిమృతి చెందింది. మృతదేహంతో ఆందోళన.. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని అక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందుగా ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా తిరిగి ఇంటికి పంపించారని తెలిపారు. మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేక చికిత్స చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స చేస్తే అక్షిత బతికేదని పేర్కొన్నారు. గర్భిణి మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి రిమ్స్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామని తెలిపారు. ముగ్గురు సీనియర్ వైద్యులతో వి చారణ జరిపించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తల్లడిల్లుతున్న తల్లులు.. గర్భిణులతోపాటు గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింతతోపాటు శిశువు మృతిచెందగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ గర్భిణి కడుపులోనే బిడ్డ మృతిచెందింది. రిమ్స్ ఆస్పత్రిలో కూడా ఓ గర్భిణి కడుపులోనే శిశువు మృతిచెందగా కనీసం వైద్యులు బయటకు తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతోనే ఇలాంటివి పునరావృతం అవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైద్యులు ఆ స్పత్రిలో ఉంటున్నారు, తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బంది ఫోన్‌చేసి సమాచారం ఇస్తేనే వస్తున్నారు. వారు వచ్చేసరికి గర్భిణులు, శిశులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. -
తెల్లారితే లోకం చూడాల్సిన పసికందు.. అమ్మా ఎందుకిలా చేశావ్!
తొమ్మిది నెలలు నీ ఊపిరితో పెంచావు.. ఎందుకు లోకాన్ని చూడనివ్వలేదు... గర్భిణి కడుపులో పసికందుకు మాటలొస్తే ఇలానే ప్రశ్నిస్తుందేమో? సాక్షి, ఆదిలాబాద్: అమ్మ.. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది. ఈ పిలుపు కోసం.. మాతృత్వపు మాధూర్యాన్ని ఆస్వాదించడం కోసం పెళ్లయిన ప్రతీ మహిళ పరితపిస్తుంది. పెళ్లయి ఏళ్లు గడిచినా గర్భందాల్చక వేలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ తన కడుపులో పసికందుకు ప్రాణం పోసిన ఆ తల్లి.. నవమాసాలు మోసింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అన్న చిన్న అనుమానంతో.. తెల్లారితే లోకం చూడాల్సిన పసికందుతో సహా తనూ ప్రాణం తీసుకుంది. పోస్టుమార్టంలో కడుపులో ఉన్నది మగబిడ్డే అని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వార్త: ఆడపిల్ల పుడుతుందని నిండుగర్భిణి ఆత్మహత్య! తీరా పోస్టుమార్టంలో.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ కదిలిస్తోంది. లోకాన్ని చూడకుండానే.. తల్లి గర్భంలోనే తనువు చాలించి.. తల్లితో కలిసి చితిమంటల్లో కాలి బూడిదైన ఆ పసికందుకు మాటలొస్తే.. తాను చేసిన తప్పేంటని? ప్రశ్నించేదేమో. ‘నీ కడుపులో ఊపిరి పీల్చుకోవడమే నేను చేసిన నేరమా?.. నీ రక్తం పంచుకోవడ మే పాపమా?.. రక్తపు ముద్దగా ఉన్న నాకు అవయవాలు ఇచ్చి రూపం ఇచ్చావు.. తొమ్మిది నెలలు నేను ఎంత ఇబ్బంది పెట్టినా భరించావు.. కడుపులో తంతుంటే సంతోషపడ్డావు కదమ్మా... కేవలం ఆడపిల్ల అన్న అనుమానంతో నాతోపాటు నీ ఊపిరి తీసుకున్నావ్. కానీ నేను మగబిడ్డనే.. లోకం ఆడపిల్ల, మగబిడ్డ అనే తేడా చూస్తుందని నాకు తెలియదు. లోకం తీరు నాకు తెలిస్తే.. దేవుడు నేను ఆడో మగో చెప్పే అవకాశం నాకు ఇస్తే తప్పకుండా నీకు విషయం చెప్పే వాడిని.. ఇప్పుడు నీ ప్రాణం తీసుకుని నా ఊపిరి ఆపేశావు.. అక్కకు నీ ప్రేమను దూరం చేశావ్. ఎందుకమ్మా ఇంత పనిచేశావ్. -
ఆడపిల్ల పుడుతుందని నిండుగర్భిణి ఆత్మహత్య! తీరా పోస్టుమార్టంలో..
-
ఆడపిల్ల పుడుతుందని నిండుగర్భిణి ఆత్మహత్య! తీరా పోస్టుమార్టంలో..
మంచిర్యాల క్రైం(ఆదిలాబాద్): తొలిసంతానం ఆడపిల్ల.. మళ్లీ ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమనుకుంటారోనని ఆందోళన చెందిన ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తీరా పోస్టుమార్టం నివేదికలో ఆమె గర్భంలో ఉన్నది మగశిశువని వైద్యులు తేల్చడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన ఎగ్గెనా ఆనంద్‌తో దండెపల్లి మండలం నర్సపూర్‌కు చెందిన రమ్య (25)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. తొమ్మిది నెలల క్రితం రమ్య మళ్లీ గర్భం దాల్చడంతో భర్త స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. 15 రోజుల క్రితం బోనాల పండుగకోసం రమ్య భర్తతో కలసి పుట్టింటికి వెళ్లింది. ప్రసవం అయ్యేంతవరకూ పుట్టింట్లోనే ఉంటానని భర్తతో చెప్పి తల్లి శారద వద్దే ఉండిపోయింది. ఈ నెల 3న వైద్య పరీక్షల కోసం రమ్య తల్లితో కలసి మంచిర్యాలకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆనంద్ ఆస్పత్రికి చేరుకుని రమ్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా నిరాకరించడంతో వెళ్లిపోయారు. డాక్టర్ ఈ నెల 6వ తేదీకి డెలివరీ డేట్ ఇవ్వడంతో కూతురును అల్లుడి ఇంటికి తీసుకుని వెళ్లి రమ్యను అక్కడే ఉండాలని సూచించింది. గురువారం కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన రమ్య..తనకు ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమంటారోనని ఆందోళన చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరిపోసుకుంది. రమ్య అంత్యక్రియలకు ముందు మృతదేహానికి వైద్యులు చేసిన పంచనామాలో ఆమె గర్భంలో ఉన్నది మగపిల్లాడని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే రమ్య అత్తింటి వారిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చీరకు నిప్పంటుకొని తొమ్మిది నెలల నిండు గర్భిణి మృతి
సాకక్షి, బాలానగర్: ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ గృహిణి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేసన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్‌లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్సీ ఆస్పత్రికి తరలించారు. గర్భంలో ఉన్న శిశువు మృతి చెందటంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? -
ఇద్దరు పిల్లలతో గర్భిణి ఆత్మహత్య
టేక్మాల్ (మెదక్): ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందోఏమో.. ఇద్దరు పిల్లలతో కలిసి తానూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కన్నతల్లి కఠిననిర్ణయంతో గచ్చుకుంట చెరువు కన్నీటిసంద్రమైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డలను, లోకం చూడని గర్భస్థ శిశువునూ తనతోపాటు కాటికి తీసుకెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం దాదాయిపల్లికి చెందిన కోటంగారి రాజు, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌కు చెందిన రజిత(25) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజుకు అంతకుముందే రేగోడ్ మండలంలోని గజ్జాడ గ్రామానికి చెందిన మహిళతో పెళ్లి అయింది. మొద టి భార్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా ఇద్దరు భార్యలతో కలసి హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ బస్సు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కోవిడ్ కారణం గా రెండేళ్ల క్రితం దాదాయిపల్లికి ఇద్దరు భా ర్యలు, పిల్లలతో కలసి తిరిగొచ్చాడు. రజితకు రిశ్వంత్(3), రక్షిత(2) సంతానం. ఆమె ప్రస్తుతం ఆరునెలల గర్భిణి. 4 రోజులుగా కుటుంబసమస్యలతో భార్యాభర్తలు గొడవపడుతున్నారు. సోమవారంరాత్రి కూడా ఇంట్లో గొడవ జరగడంతో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పిల్లలతో కలసి రజిత బయటకు వెళ్లింది. గచ్చుకుంట చెరువులో ఇద్దరు పిల్లలు, ఆమె శవమై తేలారు. భర్తపైనే అనుమానం.. రజిత, ఇద్దరు పిల్లల మృతికి రాజు కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. మొదటి భార్య ఘటనాస్థలానికి రాకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాజే ఆమెను చంపాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొనగా అల్లాదుర్గం సీఐ జార్జ్, ఎస్ఐ మోహన్‌రెడ్డి, టేక్మాల్ ట్రైనీ ఎస్ఐ శ్రీ కాంత్ వారిని శాంతింపజేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విషాదం: పురుడు పోశారు.. ప్రాణం తీశారు..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి పరిశీలించి సాధారణ ప్రసవం అవుతుందని వేచిచూశారు. రాత్రి 11గంటల వరకు వేచి చూసినా ప్రసవం జరగకపోవడం.. పురిటి నొప్పులు తీవ్రం కావడం.. అనూష కన్నీరు పెట్టడంతో కుటుంబసభ్యులు ఆపరేషన్ చేయాలని వైద్య సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో వైద్యులు 11 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సిజేరియన్ చేసి పండంటి బాబుకు పురుడుపోశారు. బాలింతను పట్టని వైద్య సిబ్బంది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే అనూష పాలిట శాపంగా మారింది. పురుడు పోసిన వైద్యులు.. అనంతరం పట్టించుకోకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. తీవ్ర రక్తస్రావం అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. తీరా అర్ధరాత్రి దాటాక గమనించే సరికి అనూష పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులకు తెలపకుండానే వైద్య సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు గమనించి నిలదీయగా.. జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. అందరూ కలిసి అనూషను కరీంనగర్‌కు తీసుకెళ్లేసరికి అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మృతదేహంతో పెద్దపల్లి ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనూష చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను సస్పెండ్ చేయాలంటూ.. విషయం తెలుసుకున్న అనూష బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అనూషకు ఆపరేషన్ చేసి నిర్లక్ష్యం చేసిన వైద్యులు రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి, స్టాఫ్‌నర్స్ నిర్మలతను సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కుమార్ గౌడ్, స్వామి వివేక్ పటేల్, శ్రావణ్ దిలీప్, అశోక్, కృష్ణ, పెద్దబొంకూర్ సర్పంచ్ మానస, ముత్తారం సర్పంచ్ కుమారస్వామి, మిట్టపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు రాజేష్, మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూష మృతిపై చేపట్టిన విచారణ ప్రాథమిక నివేదికను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవ రెడ్డి కలెక్టర్ సంగీతకు అందించారు. అయితే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వైద్యుడిని నియమించారు. అనూషకు భర్త శ్రీకాంత్, కూతురు ఉంది. మృతురాలి అత్త స్వరూప ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. చదవండి: Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..? -
నెలల గర్భిణికి ఫిట్స్.. అరగంట ముందొస్తే బతికేది...
సారంగపూర్ (నిర్మల్): ఆమె ఏడు నెలల గర్భిణి. అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కంకర పరిచి వదిలేసిన రోడ్డు.. మరోచోట కోతకు గురైన రహదారి.. దీంతో సకాలంలో ఆ గర్భిణి ఆస్పత్రికి చేరలేకపోయింది. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. గురువారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం హనుమాన్‌తండాలో జరిగిన ఈ ఘటన విషాదం మిగిల్చింది. పవార్ సురేందర్ భార్య కార్తీక ఏడు నెలల గర్భిణి. గురువారం ఆమెకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. హనుమాన్‌తండా నుంచి సేవానగర్, దుర్గానగర్ మీదుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఆర్అండ్బీ రోడ్డు ఉంది. తండా నుంచి దుర్గానగర్ వరకు నాలుగు కిలోమీటర్ల దారిలో కాంట్రాక్టర్ రెండు నెలలుగా కంకర పరిచి వదిలేశాడు. పని పూర్తి చేయించడంలో అధికారులూ అలసత్వం ప్రదర్శించారు. నరకప్రాయంలాంటి ఈ రోడ్డుపై 108 వాహనం హనుమాన్‌తండా వరకు వెళ్లలేని పరిస్థితి. దీనికితోడు మధ్యలో హైలెవల్ కాలువ వద్ద, దుర్గానగర్ వద్ద రోడ్డు కోతకు గురైంది. కార్తీకను అతికష్టం మీద కంకర పరిచిన రోడ్డుపై ఆటోలో కొంతదూరం తరలించి, అనంతరం కారులో నిర్మల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కంకర పరిచిన రోడ్డు ప్రయాణంలో విపరీతమైన కుదుపులతో కార్తీక తీవ్ర అవస్థలు పడింది. ఎట్టకేలకు నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. అరగంట ముందుగా ఆసుపత్రికి తీసుకొస్తే ఉంటే గర్భిణి సురక్షితంగా ఉండేదని వైద్యులు తెలిపారు. రోడ్డు మార్గం సరిగ్గా ఉంటే తన భార్య బతికేదని, ఆమె మృతికి అధికారులు, కాంట్రాక్టరే బాధ్యులని ఆమె భర్త సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చుట్టపుచూపుగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ
సాక్షి, శంకర్పల్లి: అన్నదమ్ముల ఘర్షణలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోకిల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్ పెంటయ్య, భిక్షపతి అన్నదమ్ములు. వీరికి ఇంటి స్థలం విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు వీరి ఇద్దరి మధ్య ఇటీవల రాజీ కుదిర్చారు. బుధవారం సాయంత్రం భిక్షపతి నిర్మిస్తున్న ఇంటిపై ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇటుక బయటకు విసిరారు. ఆ ఇటుక.. ఇంటి పక్కన కూర్చున్న పెంటయ్యపై పడింది. దీంతో తనను చంపడానికే భిక్షపతి ఇటుక వేశాడంటూ అతడు నానా గొడవ చేశాడు. విషయం తెలుసుకున్న పెంటయ్య కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, పద్మారావు భిక్షపతిపై దాడికి దిగారు. దీంతో భిక్షపతి భార్య పద్మతో పాటు ఐదు నెలల గర్భిణి అయిన ఆమె మనుమరాలు లావణ్య(22)లు వచ్చి గొడవ ఆపేందుకు ప్రయత్నించారు. ఆ ఘర్షణలో లావణ్య కడుపుపై శ్రీనివాస్ తన్నడంతో ఆమె స్పహ తప్పి పడిపోగా శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు పేర్కొన్నారు. లావణ్య స్వగ్రామం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామం కాగా.. పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన సత్యంతో ఆమెకు వివాహమైంది. లావణ్య రెండు రోజుల కిందట అమ్మమ్మ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చింది. బంధువుగా వచ్చిన ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనలో పెంటయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నామని, పద్మారావు పరారీలో ఉన్నాడని సీఐ గోపీనాథ్ తెలిపారు. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. భారీగా పోలీసుల మోహరింపు మృతురాలు లావణ్య స్వగ్రామం కొండకల్ నుంచి, అత్తవారు గ్రామం పెద్దకంజర్ల నుంచి గ్రామస్తులు, బంధువులు గురువారం మోకిలకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి -
నర్సాపూర్ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి
నర్సాపూర్ రూరల్: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతిచెందిందంటూ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి తండా, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని కుషన్ గూడ తండాలకు చెందిన గిరిజనులు బుధవారం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్సై గంగరాజు పోలీసులతో అక్కడికి చేరుకొని చెదరగొట్టారు. ఈ సందర్భంగా మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ నిండు గర్భిణీ అయిన ధారవత్ సునీతను (27) ఈ నెల 1వ తేదీన ఆమె భర్త రాజు ఇతర కుటుంబ సభ్యులు ప్రసవం కోసం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించారు. మంగళవారం రాత్రి సునీతకు లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సునీతా మృత్యువాత పడినట్లు చెప్పారు. నర్సాపూర్ ఆస్పత్రిలో వైద్యుల సరిగా చూడక పోవడంతోనే సునీతా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు సునీతాకు ఐదేళ్ళ కూతురు ఉంది. నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబీకులతో మట్లాడుతున్న ఆంజనేయులు ప్రభుత్వ వైఫల్యమే కారణం.. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది, పరికరాలు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. నిరుపేదల వైద్య సేవల పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు కపట ప్రేమ కనబర్చడంతోనే నిండు గర్భిణీ మృతిచెందిదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు గర్భిణీ మృతికి బాధ్యత వహించి బాధిత కుటుండాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేయలేదు.. మృతురాలు సునీతా వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మీర్జా నజీమ్ బేగ్ వివరణ ఇచ్చారు. సునీతకు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగ లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా మారిందన్నారు. వెంటనే సంగారెడ్డిలోని హైరిస్క్ కేంద్రానికి రెఫర్ చేశామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడ లేదన్నారు. వెయ్యిలో ఒకరికి ప్రసవ సమయంలో లోబీపీ, రక్తస్రావం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం ఖరీదు రూ.2 లక్షలు!
అనంతపురం హాస్పిటల్: నగరంలోని క్రాంతి ఆస్పత్రిలో శుక్రవారం ఓ బాలింత మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబీకులకు రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం అలంకరాయునిపేటకు చెందిన శివశేషారెడ్డి, అనూష దంపతులు. అనూష గర్భందాల్చినప్పటి నుంచి నగరంలోని క్రాంతి ఆస్పత్రిలోనే చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న పురిటినొప్పులు రావడంతో క్రాంతి ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు 12 గంటలకు అనూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో అనూషకు రక్తస్రావం మొదలైంది. రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు గర్భసంచి తొలగించాలని మూడు బాటిళ్ల బీ పాజిటివ్ రక్తం కావాలని చెప్పారు. దీంతో భర్త శివశేషారెడ్డి, తదితరులు రక్తం సిద్ధం చేశారు. రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు ప్రాణం కాపాడలేమని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో అనూష (20) మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఆందోళన వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందంటూ భర్త శివశేషారెడ్డి వారి కుటుంబ సభ్యులు క్రాంతి ఆస్పత్రి నిర్వాహకుడు మురళీని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. త్రీటౌన్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబంతో సెటిల్మెంట్ బాలింత అనూష మృతికి నైతిక బాధ్యత వహిస్తూ క్రాంతి ఆస్పత్రి యాజమాన్యం రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. డబ్బులు మళ్లీ ఇస్తామని చెప్పడంతో మృతుల కుటుంబాలు ఒప్పుకోలేదని తెలిసింది. చివరికి ప్రస్తుతం చెక్ తీసుకెళ్లాలని, శనివారం రూ.2 లక్షలు క్యాష్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. పత్తాలేని ఆరోగ్యశాఖ ప్రభుత్వం మాతా, శిశు మరణాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుంటే ఆరోగ్యశాఖ మాత్రం ఓ బాలింత మృతి జరిగినా అటువైపు తొంగిచూడలేదు. ఒక్క అధికారి కూడా క్రాంతి ఆస్పత్రిలో జరిగిన ఘటనపై స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్డియాక్ వల్లనే... బాలింత అనూషకు కార్డియాక్ అరెస్టు కావడం వల్లనే మృతి చెందిందని, తమ వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని క్రాంతి ఆస్పత్రి నిర్వాహకుడు మురళీ తెలిపారు. -
‘యాదాద్రి’ జిల్లాలో తొలి కరోనా మరణం
రాజాపేట(ఆలేరు) : యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో వైరస్ అంటుకుని ఓ బాలింత మృత్యువాత పడింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు భార్య సంతోష (23)కు ఒక్కటిన్నర సంవత్సరాల కుమార్తె ఉంది. కాగా మళ్లీ గర్భిణిగా ఉండటంతో రాజాపేటలో వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉందని చెప్పడంతో జనగామ జిల్లా బచ్చన్నపేటలోని తన తల్లిగారింటికి వెళ్లింది. గత నెల 28న జనగామలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో తిరిగి రాజాపేట ప్రభుత్వ అస్పత్రికి రావడంతో వైద్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో సంతోష తిరిగి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ కూడా సంతోషను ఉస్మానియాకు రెఫర్ చేయడంతో 29న హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సంతోష పరిస్థితి అందోళనకరంగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించి 31న ఉస్మానియాకు పంపించారు. అక్కడ రాత్రి సంతోష మగశిశువుకు జన్మనివ్వగా మృతిచెందాడు. ఈ నెల 1 సంతోష ప రిస్థితి విషమించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందింది.అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. తొమ్మిది మందిని క్వారంటైన్‌కు తరలింపు దూదివెంకటాపురం గ్రామంలో కరోనాతో మహిళ మృతిచెందిందన్న వార్తతో అధికారులు ప్రైమరి, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. సంతోష భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు మామ ఎర్రోళ్ల మాతయ్య, భార్య మైసమ్మ, రెండో కుమారుడు కర్ణాకర్, భార్య హారిక, సంతోష కుమార్తె హేమశ్రీ, ఇంటి పక్కనే ఉంటున్న మాతయ్య సోదరుడు వెంకటయ్య, భార్యతోపాటు సంతోష తల్లితో కలిపి 9 మందిని అధికారులు బీబీనగర్ ఏయిమ్స్‌కు తరలించారు. కాగా మరో 20 మందిని సెకండరీ కాంటాక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. అంతే కాకుండా సంతోషను ఉస్మానియా అస్సత్రిలో చూడటానికి వెళ్లినవారితోపాటు కుటుంబ సభ్యులను నలుగురిని బచ్చన్నపేటలో ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి అక్కడి అధికారులకు సమాచారం అందించారు. భయాందోళనలో గ్రామస్తులు గ్రామ పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తున్న నాగరాజు అందరితో కలివిడిగా ఉండేవాడు. ఒక్కసారిగా అతని భార్య కరోనాతో మృతిచెందిందని తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. నాగరాజు నిత్యం విధుల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేవాడు. కాగా నాగరాజు అందరితో కలిసి ఉండటం, కలిసి మాట్లాడాడని గ్రామస్తులంతా కరోనా వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో శానిటేషన్ పనులు గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రిధర్ సర్పంచ్ వస్పరి ధనలక్ష్మి విష్ణులు గ్రామంలో శానిటేషన్ పనులు ప్రారంభించారు. వాటర్ ట్యాంకర్లో బ్లీచింగ్ ఫౌడర్‌ను కలిపి స్ప్రేచేయడంతోపాటు, దండోర వేయించి గ్రామస్తులను ఇంటినుంచి బయటికి రావొద్దని, అత్యవసర పనుల నిమిత్తం వెళితే మాస్కులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. నీలగిరిలో కరోనా కలకలం నల్లగొండ : నీలగిరిలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విజయవాడలో పెట్రోల్ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తి నాలుగు రోజుల క్రితం నల్ల గొండలోని ప్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని తన నివాసానికి వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి రెండు మాసాలపాటు విజయవాడలో ఉన్నాడు. కోదాడ సమీపంలో పెట్రోల్ బంక్ వ్యాపారం చేస్తూ లాక్డౌన్ కారణంగా విజయవాడలో ఉంటూ వ్యాపార లావాదేవీలు చూసుకున్నాడు. గత శుక్రవారం విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండకు వచ్చాడు. అనారోగ్యానికి గురి కావడంతో శనివారం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం వారు కరోనా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని రిపోర్డులు వచ్చాయి. దీంతో డీఎంహెచ్ఓ కొండల్రావు, సర్వే లైన్ డా. రాహుల్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారినుంచి కూడా కరోనా నమూనాలను తీసి పరీక్షలకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. -
కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య
తూప్రాన్: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళ తనకు కరో నా వైరస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహ త్య చేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిష్టయ్య భార్య నాగమణి అలియాస్ పద్మ (41) పట్టణంలోని అక్షర స్కూల్లో టీచర్. కొన్నాళ్లుగా ఆమె టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తనకూ సోకుతుందనే భయంతో ఆదివారం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు అందినట్టు పోలీసులు చెప్పారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి
సాక్షి, వికారాబాద్: వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన శుక్రవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లికి చెందిన మీనా వైద్యం కోసం మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడ నర్సులు వైద్యం చేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడంతో వెంటనే 108 వాహనంలో సదాశివపేటకు తరలించగా.. వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణి మార్గమధ్యలోనే మృతి చెందింది. వైద్య సేవల్లో జాప్యం చేయడం వల్లనే మీనా మృతిచెందిందని ఆరోపిస్తూ.. మృతురాలి కుటుంబసభ్యులు మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. -
నిండుకున్న ఇంధనం.. నిండుచూలాలు మరణం
భువనేశ్వర్: మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా, అంబులెన్సులో ఇంధనం అయిపోయి నిండు గర్భిణి మరణించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. హండా గ్రామానికి చెందిన తులసికి శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను సమీపంలోనిఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం మరోæ హాస్పిటల్‌కు అంబులెన్సులో తరలిస్తుండగా ఇంధనం అయిపోయింది. మరో అంబులెన్సు రావడానికి గంటకు పైగా పట్టింది. ఈలోగా గర్భిణి ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. -
గర్భిణి ప్రాణం తీసిన కంచె
సాక్షి, నిర్మల్ : మండలంలోని కిషన్రావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుముందు తండాకు చెందిన రాథోడ్ లావణ్య (22), గజానంద్‌కు ఏడాదిన్నర కిందట పెళ్లైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. వ్యవసాయ కుటుంబం కావడంతో లావణ్య వ్యవసాయ పనులు చూస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. బుధవారం గ్రామ శివారులోని తమ పంట చేనులోకి బుధవారం ఉదయం 10 గంటలకు లావణ్య తన మామతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా దారిలో కాల్వ ఉండటంతో పక్కనే వ్యవసాయ పంట చేనులోని గట్టు నుంచి వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన చౌహాన్ గోపి అనే రైతు మొక్కజొన్న పంట చేనుకు రక్షణగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు. ఆ వైపుగా వచ్చిన లావణ్య గమనించక విద్యుత్ వైర్లను తగలగంతో అక్కడికక్కడే మృతి చెందింది. పంటచేను వద్దే ఉందనుకున్న భర్త... బుధవారం రాత్రి వర్షం ఉండటంతో లావణ్య పంటచేనులోనే ఉందని భర్త గజానంద్ భావించాడు. గురువారం ఉదయం పంటచేనుకు వెళ్లి తన తండ్రిని తెలుసుకోగా బుధవారం సాయంత్రమే కోడలు ఇంటికి వెళ్లిందని తెలిపాడు. దీంతో లావణ్య కోసం వెతకడం ప్రారంభించగా మృతిచెంది విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్సై ఆసీఫ్‌అలీ చేరుకుని వివరాలు సేకరించారు. తహసీల్దార్ శివప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది నెలల గర్భిణీ.. లావణ్య గజానంద్‌కు పెళ్లై ఏడాదిన్నర అవుతుంది. లావణ్య ఎనిమిది నెలల గర్భిణీ. మరో నెల రోజుల్లో ఆ ఇంట్లోకి ఓ చిన్నారి రానుందనే ఆనందంలో ఆ కుటుంబం ఉంది. ఇంతలో విద్యుత్ తీగలు వారి ఆనందాన్ని చిదిమేశాయి. దీంతో చెరువుముందుతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వైద్యం వికటించి బాలింత మృతి
సాక్షి, కాజీపేట (వరంగల్): వైద్యుల నిర్లక్ష్యం కారణం బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించిన ఘటన కాజీపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మసాగర్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మిట్టపల్లి సునిత(31) మూడో కాన్పు నిమిత్తం డీజిల్ కాలనీలోని ప్రసాద్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు అన్నిరకాల పరీక్షలు చేసి రెండ్రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేయగా సునిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు కాస్త బలహీనంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులోని సేఫ్టీ బాక్స్‌లో పెట్టడానికి సునిత భర్త సాంబరాజు తీసుకెళ్లాడు. బుధవారం రాత్రి ఒక్కసారిగా సునిత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బంధువులు వైద్యం అందించాలని కోరినప్పటికీ సకాలంలో చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం ప్రసాద్ ఆస్పత్రి ఎదుట బైటాయించారు. ముగ్గురు పిల్లలను అనాథను చేసిన ఆస్పత్రి నిర్వాహకులు ఆ కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మసాగర్ జెడ్పీటీసి సభ్యురాలు శ్రీలత, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యురాలు ఎండీ జుబేదాబేగంతో పాటు పలువురు టీఆర్ఎస్ సర్పంచ్‌లు, మండల ప్రాదేశిక సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసు బందోబస్తు.. మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనే డిమాండ్‌తో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైటాయించడంతో కాజీపేట– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాజీపేట ఏసీపీ నర్సింగరావుతో పాటు సీఐలు అజయ్, జానినర్సింహులు సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పి, ట్రాఫిక్‌ను పునరుద్దారించారు. పరిహారంపై చర్చ.. వైద్యులే సునిత మృతికి బాధ్యత వహించి తగు న్యాయం చేయాలని, బాధితకుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు ఆస్పత్రి వర్గాలతో చర్చలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు చర్చింనప్పటికీ కొలిక్కిరాలేదు. అయితే వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం ఏమిలేదంటూ పరిహారం ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో రాతిర్ర అయినప్పటికీ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతిరాలి బంధువులు సునీత(ఫైల్) -
దారుణం : నార్మల్ డెలివరీ చేస్తుండగా..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్ర సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకుండానే ఓ బాలింతకు నార్మల్ డెలివరీ చేయబోయారు ఆస్పత్రి సిబ్బంది. పరిస్థితి విషమించడంతో తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. మొగుళ్లపల్లి మండలం ఎస్ పేట గ్రామానికి చెందిన కవిత అనే బాలింత డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన సిబ్బంది.. నార్మల్ డెలివరీ కోసం లేబర్ రూమ్‌కి తరలించారు. ఆస్పత్రిలో పని చేసే గైనకాలజిస్ట్ లేకుండానే ఆమెకు నార్మల్ డెలివరీ చేయబోయారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లి, కూతురు మృతి చెందారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బంధువులతో కలిసి ఆస్పత్రి అద్దాలు, పర్నీచర్ పగులగొట్టారు. -
బాలింత మృతి..!
పాచిపెంట: మండలంలోని కేసలి పంచాయతీ గిరిశిఖర ఊబిగుడ్డి గ్రామానికి చెందిన బాలింత కోట రాములమ్మ (33) గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోట రాములమ్మ ఏప్రిల్ 20న సాలూరు సీహెచ్‌సీలో నాలుగో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు రోజులు తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె ఇంటి వద్దే గురువారం ఉదయం కన్నుమూసింది. పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం చిన్నారులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరణాలు గోప్యం.. గిరిజన గ్రామాల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇవేమీ కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం బాధాకరం. ఊబిగుడ్డి గ్రామానికి చెందిన కె.రమణమ్మ మంగళవారం మృతి చెందింది. ఈ ఏడాది మార్చిలో గిరిశిఖర మోదుగ పంచాయతీలో శెబి ఈశ్వరరావు, అప్పలమ్మల కుమార్తె ( 9 నెలల చిన్నారి), బంగారుగుడ్డిలో తామర కన్నమ్మ కుమార్తె (9 నెలల చిన్నారి) విరేచనాలతో బాధపడుతూ మృతి చెందారు. ఇలాంటి మరణా లె న్నో జరుగుతున్నా సంబంధిత అధికారుల్లో చల నం రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ నిర్వహిస్తాం.. గిరిజన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న మరణాలపై ప్రత్యేక బృందాలను పంపించి విచారణ నిర్వహిస్తాం. కోట రాములమ్మ ఇటీవల జన్మనిచ్చిన ఇద్దరు ఆడపిల్లలు లో బæర్త్ వెయిట్ (వయసుకు తగ్గ బరువు లేనట్లుగా) ఉన్నట్లు అక్కడ వైద్యాధికారులు తెలిపారు. వారికి తక్షణమే న్యూట్రీషియన్ రీహెబిలిటేషన్ కేంద్రానికి తరలించి వైద్యసేవలందిస్తున్నాం.– రవికుమార్ రెడ్డి, ఐటీడీఏ ఇన్చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్ఓ -
ప్రసవమైన అరగంటకే బాలింత మృతి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం:డెలివరీ జరిగిన అరగంటకే బాలింత మృతి చెందడంతో అందుకు వై ద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆ గ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యు లు నర్సింగ్‌హోం ముందు ఆందోళన చేసినసంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది.చెన్నపట్టణ తాలూకా దేవనహొసహళ్లి గ్రామానికి చెందిన రశ్మి (19) డెలివరీ కో సం పట్టణంలోని బాలు నర్సింగ్‌హోంలో చేర్చారు. సోమవారం ఉదయం డెలివరీ కాగా అరగంటకే రశ్మి మృతి చెందింది. డెలివరీ చేసిన డాక్టర్ శైలజ నిర్లక్ష్యం వల్లే రశ్మి మృతి చెందింద ని ఆగ్రహించిన మృ తురాలి కుటుంబ సభ్యులు నర్సింగ్‌హోం ముందు ఆందోళన చేపట్టారు. రశ్మి మృతిచెందిన తక్షణం వైద్య సిబ్బంది శవాన్ని ఆపరేషన్ థియేటర్లోనే వదిలి పరారయ్యారని బాధితులు ఆరోపించారు. చెన్నపట్టణ పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.