
పార్వతి (ఫైల్)
తమిళనాడు, అన్నానగర్: ఉలుందూర్‌పేట సమీపంలో బుధవారం గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉలుందూర్‌పేట సమీపం కూవాడు ప్రాంతానికి చెందిన ఏలుమలై (23) కార్మికుడు. ఇతని భార్య పార్వతి (19). వీరికి వివాహం జరిగి తొమ్మిది నెలలు అవుతోంది. పార్వతి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉంది. దంపతుల మధ్య కుటుంబ సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా తరచు తగదా ఏర్పడుతూ వచ్చింది.
ఈ స్థితిలో బుధవారం పార్వతి ఇంట్లో ఉరికి శవంగా వేలాడుతుంది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పార్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉలుందూర్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా పార్వతి అన్న సూర్య ఉలుందూర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన చెల్లెలి మృతిలో తనకి అనుమానం ఉన్నట్లుగాను, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment