
నిర్మల్ జిల్లా భైంసాలో విషాద ఘటన
భైంసాటౌన్: కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చి తర్వాత కాసేపటికి తానూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాకు చెందిన రాథోడ్ మనోజ్ తన భార్య శీతల్ (25)కు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయతి్నంచారు. అయితే నొప్పులు ఎక్కువ కావడం, కాన్పు కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా.. ఆ కాసేపటికే శీతల్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment