కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య | Pregnant Woman Committed Suicide Due To Fear Of Coronavirus At Medak District | Sakshi
Sakshi News home page

కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య

Published Mon, May 25 2020 2:59 AM | Last Updated on Mon, May 25 2020 2:59 AM

Pregnant Woman Committed Suicide Due To Fear Of Coronavirus At Medak District - Sakshi

తూప్రాన్‌: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళ తనకు కరో నా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహ త్య చేసుకుంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిష్టయ్య భార్య నాగమణి అలియాస్‌ పద్మ (41) పట్టణంలోని అక్షర స్కూల్‌లో టీచర్‌. కొన్నాళ్లుగా ఆమె టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో తనకూ సోకుతుందనే భయంతో ఆదివారం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు అందినట్టు పోలీసులు చెప్పారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement