
ప్రతీకాత్మక చిత్రం
భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది. అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో..
సాకక్షి, బాలానగర్: ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ గృహిణి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేసన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్‌లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది.
చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె
అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్‌ఎన్‌సీ ఆస్పత్రికి తరలించారు. గర్భంలో ఉన్న శిశువు మృతి చెందటంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో?