![pregnant woman died in road accident](/styles/webp/s3/article_images/2024/08/8/woman.jpg.webp?itok=ezgvLUz0)
= గర్భిణి, కడుపులోని శిశువు దుర్మరణం
దొడ్డబళ్లాపురం: లారీ ఓ స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి మహిళ దుర్మరణం పాలైంది. ఆమె కడుపు బద్ధలై గర్భస్త శిశువు బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ ఘోరం నెలమగల తాలూకా ఎడేహళ్లి గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గర్భిణి సించన (20) భర్తతో కలిసి స్కూటర్‌పై ఎడేహళ్లి వద్ద సరీ్వస్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారి ఢీకొంది.
సించన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, పొట్ట చీలిపోవడంతో గర్భస్థ పిండం బయటకు వచ్చింది. భర్త మంజునాథ్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ దారుణాన్ని చూసి అగ్రహోదగ్రులైన స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment