విచారణ నిర్వహిస్తున్న పాచిపెంట పీహెచ్‌సీ వైద్యాదికారి రాజ్‌కుమార్
పాచిపెంట: మండలంలోని కేసలి పంచాయతీ గిరిశిఖర ఊబిగుడ్డి గ్రామానికి చెందిన బాలింత కోట రాములమ్మ (33) గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోట రాములమ్మ ఏప్రిల్ 20న సాలూరు సీహెచ్‌సీలో నాలుగో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు రోజులు తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె ఇంటి వద్దే గురువారం ఉదయం కన్నుమూసింది. పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం చిన్నారులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. పాచిపెంట పీహెచ్‌సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మరణాలు గోప్యం..
గిరిజన గ్రామాల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇవేమీ కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం బాధాకరం. ఊబిగుడ్డి గ్రామానికి చెందిన కె.రమణమ్మ మంగళవారం మృతి చెందింది. ఈ ఏడాది మార్చిలో గిరిశిఖర మోదుగ పంచాయతీలో శెబి ఈశ్వరరావు, అప్పలమ్మల కుమార్తె ( 9 నెలల చిన్నారి), బంగారుగుడ్డిలో తామర కన్నమ్మ కుమార్తె (9 నెలల చిన్నారి) విరేచనాలతో బాధపడుతూ మృతి చెందారు. ఇలాంటి మరణా లె న్నో జరుగుతున్నా సంబంధిత అధికారుల్లో చల నం రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ నిర్వహిస్తాం..
గిరిజన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న మరణాలపై ప్రత్యేక బృందాలను పంపించి విచారణ నిర్వహిస్తాం. కోట రాములమ్మ ఇటీవల జన్మనిచ్చిన ఇద్దరు ఆడపిల్లలు లో బæర్త్ వెయిట్ (వయసుకు తగ్గ బరువు లేనట్లుగా) ఉన్నట్లు అక్కడ వైద్యాధికారులు తెలిపారు. వారికి తక్షణమే న్యూట్రీషియన్ రీహెబిలిటేషన్ కేంద్రానికి తరలించి వైద్యసేవలందిస్తున్నాం.– రవికుమార్ రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment