
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. నైట్రోజన్ వాయువును కేంద్రీకరించే యంత్రాన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌గా మార్చారు. నమూనా యంత్రం ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు ముగించుకుంది. ‘ప్రెషర్ స్వింగ్ అడ్సాప్షన్’(పీఎస్‌ఏ) టెక్నాలజీ తోనే ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ యంత్రంతో వాతావరణ పీడనానికి 3.5 రెట్లు ఎక్కువ పీడనంతో, 93 నుంచి 96 శాతం స్వచ్ఛతతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. జియోలైట్ అనే పదార్థం సాయంతో నైట్రోజన్, ఇతర వాయువులను తొలగించి ఆక్సిజన్‌ను కేంద్రీ కరిస్తుంది. నైట్రోజన్‌ను కేంద్రీకరించే యంత్రాల్లో జియోలైట్ స్థానంలో కార్బన్‌ను ఉపయోగిస్తారు. దేశంలోని నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చగలిగితే సులువుగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధన లకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే తెలిపారు.
చదవండి: కాన్సన్‌ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్ ?
రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment