ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ | Oxygen Tanker Reaches Ananthapur In Just 3 Hours From Karnataka | Sakshi
Sakshi News home page

ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌

Published Fri, May 14 2021 12:20 PM | Last Updated on Fri, May 14 2021 12:50 PM

Oxygen Tanker Reaches Ananthapur In Just 3 Hours From Karnataka - Sakshi

అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చొరవతో ఆక్సిజన్‌ ఇబ్బందులకు చెక్‌ పడింది.

అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చొరవతో ఆక్సిజన్‌ ఇబ్బందులకు చెక్‌ పడింది. బళ్లారి నుంచి అనంతపురం వరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటైంది. అయితే పోలీసు ఎస్కార్ట్‌తో కర్ణాటక లోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ కేవలం 3 గంటల్లోనే అనంతపురానికి చేరేలా ఎస్పీ సత్యయేసుబాబు చర్యలు తీసుకున్నారు. 

బళ్లారి నుంచి అనంతపురం దాకా దారి పొడవునా పోలీసులను అప్రమత్తం చేసిన ఎస్పీ.. ఆక్సిజన్ ట్యాంకర్ సాఫీగా వెళ్లేలా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ఆక్సిజన్ ట్యాంకర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ చొరవతో సకాలంలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అనంతపురానికి చేరుకుంది. దీంతో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు ఊరట కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement