
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించిన అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సభ్యులకు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ ధన్యవాదాలు అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారు: శివ భరత్ రెడ్డి
మేమంతా కలిసి తెలుగు ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించాము. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము కూడా సాయం చేస్తున్నాము అని ఏపీ ఆటా ప్రతినిధి శివ భరత్ రెడ్డి తెలిపారు.
చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళమిచ్చిన ఆటా
Comments
Please login to add a commentAdd a comment