
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో ఏపీకి ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) తమ వంతు సాయం అందించింది. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద అందించారు. ప్రాథమికంగా 50 కాన్సంట్రేటర్స్‌ను అందించిన ఆటా మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు భువనేష్ భుజాల, కార్యదర్శి హరిప్రసాద్ లింగల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment