నాగపూర్: కరోనాతో అల్లాడుతున్న నాగపూర్ ఆస్పత్రులకు నగరానికి చెందిన ప్యారే ఖాన్ ఉదారతతో ఆక్సిజన్ అందే ఏర్పాట్లు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ అధిపతైన ఖాన్ నగరానికి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను సొంత డబ్బును వెచ్చించి తెప్పించారు. ఇందు కోసం ఆయన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. పవిత్ర రంజాన్ ఆరంభమైందని, ఈ సందర్భంగా తనవంతు బాధ్యతగా చేయాల్సిన జకాత్ (దాక్షిణ్య కార్యక్రమాలు)కు సొమ్ములిచ్చే బదులు అవే డబ్బులను రోగుల కోసం ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ఉపయోగిం చాలని నిర్ణయించానని ఖాన్ తెలిపారు.
తొలుత ఆయన బెంగుళూరు నుంచి అధిక ధర వెచ్చించి ట్యాంకర్లు తెప్పించారు. అనంతరం నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ సాయంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్లను తెప్పించామని తెలిపారు. ఇవేకాకుండా ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో 116 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు తెలిపారు. ఖాన్ సాయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ కొనియాడారు.
చదవండి: లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు
Comments
Please login to add a commentAdd a comment