కరోనా ఫస్ట్ వేవ్ నుంచి నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటూనే ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ వివిధ రకాలుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్న ఆయన తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు భారతదేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులు దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్ అయితే డీటీడీసీ ద్వారా కొరియర్లు పంపనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేయాలని సోనూ సూద్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
చదవండి :
యాంటీ కోవిడ్ డ్రగ్స్ సెలబ్రిటీల వద్ద ఎలా ఉన్నాయి : హైకోర్టు
Sonu Sood: నేనూ సోనూసూద్ అవుతా
Comments
Please login to add a commentAdd a comment